- Advertisement -
ఆర్టీసీ మహిళా కండక్టర్ ప్రవళిక మృతిపై సీఎం సంతాపం
కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది: రేవంత్రెడ్డి
CM expresses condolences over the death of RTC woman conductor Pravalika
హైదరాబాద్: టీజీఎస్ ఆర్టీసీ మణుగూరు డిపో మహిళా కండక్టర్ గుండ్ల ప్రవళిక మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలిపారు.
ప్రవళిక కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని, అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తుందని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు.
- Advertisement -




