ఢిల్లీలో రేవంత్ విందు అంశంలో సీఎం జగన్ సీరియస్!
తెలంగాణ సీఎంగా ప్రమాణ స్వీకారం చేపట్టాక తన ఎంపీ పదవికి రాజీనామా చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఐతే డిసెంబర్ 19వ తేదీన ఢిల్లీ లో మల్లికార్జున ఖర్గే, కే.సీ వేణు గోపాల్ తో భేటీ అయ్యాక గత నాలుగేళ్లుగా లోక్ సభలో తనతో పాటు కలిపి పనిచేసిన వివిధ పార్టీల ఎంపీలకు రేవంత్ రెడ్డి విందు ఇచ్చారు.
ఐతే ఈ విందులో టీడీపీ నుంచి గల్లా జయదేవ్, వైసీపీ నుంచి లావు కృష్ణదేవ రాయలు, వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి , అయోధ్య రామి రెడ్డి, బీద మస్తాన్ రావు,వల్లభనేని బాలశౌరి, యస్. నిరంజన్ రెడ్డి , మాగుంట శ్రీనివాసరెడ్డి, వంగా గీత, పోచ బ్రహ్మానంద రెడ్డి, గోరంట్ల మాధవ్, ఆదాల ప్రభాకర్ రెడ్డి, చింతా అనురాధ, బీశెట్టి వెంకట సత్యవతి తో పాటు వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘు రామ కృష్ణంరాజు పాల్గొన్నారు.
ఆ విందుకు వైసీపీ ఎంపీలు వెళ్లడంపై ఆగ్రహం.ఎంపీలను పిలిచి మరీ క్లాస్ పీకిన సీఎం జగన్. తనకు తెలియకుండా, పార్టీకి సమాచారం లేకుండా…
రేవంత్‌ని ఎంపీలు కలవడంపై సీఎం జగన్ అసహనం. మీరంతా పెద్దవాళ్లు.. మరి ఇలా చేస్తారా…
బయటకు సిగ్నల్స్ ఎలా వెళ్తాయి అంటూ నిలదీత ఇంత చిన్న విషయానికే ఇలా మాట్లాడితే… ఎలా ఉంటున్న వైసీపీ ఎంపీలు.అదే రోజు ఎంపీలకు విందు ఇచ్చిన విజయసాయిరెడ్డి.
విజయసాయిరెడ్డి విందుకు హాజరై అక్కడ నుంచి…
— నేరుగా రేవంత్ ఇచ్చిన విందుకు హాజరైన వైసీపీ ఎంపీలు
— ఢిల్లీలో జరిగిన వ్యవహారాన్ని సీఎంకు చెప్పిన మిథున్‌రెడ్డి
-ఎంపీల తీరుపై అసహనం వ్యక్తం చేసిన సీఎం జగన్