వైయస్ఆర్ ఘాట్ వద్ద సీఎం జగన్ ఘన నివాళికడప జిల్లా:డిసెంబర్ 24
రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆదివా రం ఉదయం ఇడుపులపా యి, వైఎస్ఆర్ ఘాట్ వద్ద దివంగత ముఖ్యమంత్రి డా.వైఎస్ఆర్ కు ఘనంగా నివాళులు అర్పించారు.
మూడు రోజుల జిల్లా పర్యటనలో భాగంగా కడప జిల్లా ఇడుపులపాయకు విచ్చేసిన రాష్ట్ర ముఖ్య మంత్రి జగన్ రెండవ రోజు ఇడుపులపాయలోని డాక్టర్ వైయస్ఆర్ విగ్రహా నికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ముఖ్యమంత్రితో పాటు వైఎస్ఆర్ ఘాట్ వద్దకు చేరుకున్న జిల్లా ఇంఛార్జి మంత్రివర్యులు ఆదిమూ లపు సురేష్, ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డి, ఎంఎల్సీ రామచంద్రారెడ్డి, జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామ రాజు పాల్గొనగా..
జడ్పీ చైర్మన్ ఆకేపాటి అమ ర్నాథరెడ్డి, ఎమ్మెల్యే కొర ముట్ల శ్రీనివాసులు, కడప మేయర్ సురేష్ బాబు, జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్, ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ హేమచంద్రారెడ్డి, పరిశ్రమలశాఖ ముఖ్య సలహాదారు రాజోలి వీరారెడ్డి,తదితరులు దివంగత ముఖ్యమంత్రి డా.వైఎస్ఆర్ కు నివాళులు అర్పించారు…..



