విధి నిర్వహణలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ 1 కోటి బీమా అందచేసిన సీఎం రేవంత్

- Advertisement -

విధి నిర్వహణలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ 1 కోటి బీమా అందచేసిన సీఎం రేవంత్
హైదరాబా్ద్

CM Revanth Hands Over ₹1 Crore Insurance to Families of Those Who Died in the Line of Duty
విద్యుత్ శాఖలో పనిచేస్తూ విధి నిర్వహణలో మరణించిన వారి కుటుంబాలకు రూ.1 కోటి చొప్పున ప్రమాద బీమా చెక్కులను  ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి  అందచేసారు. విద్యుత్ శాఖలో పని చేస్తూ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఓర్సు సురేశ్, ముక్తార్ బేగ్ కుటుంబ సభ్యులకు రూ.కోటి చొప్పున చెక్కులు అందజేసారు. మృతి చెందిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు ముందుకు వచ్చిన విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్కను సీఎం అభినందించారు.
ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ. 5 లక్షల నుంచి పది లక్షలకు పెంచాం. సీపెక్ సర్వే ప్రకారం తేలిన కుటుంబాలన్నింటికీ రూ. 5 లక్షల బీమా వర్తిస్తుంది . కుటుంబ పెద్ద మరణించినప్పుడు ఆ కుటుంబం వీధిన పడొద్దని భావనతో కుటుంబ బీమా తీసుకొచ్చాం. విద్యుత్, సింగరేణి కార్మికులకు రూ. కోటి పైన ప్రమాద బీమా సౌకర్యం కల్పించామని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular