పలు అభివృద్ది పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన
అదిలాబాద్
CM Revanth lays foundation stone for various development works
ఆదిలాబాద్ జిల్లా పిప్రి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం నాడు శంకుస్థాపనలు చేసారు.
బోథ్ నియోజకవర్గం అడేగామా గ్రామంలో యంగ్ ఇండియా సమీకృత గురుకుల పాఠశాల నిర్మాణానికి శంకుస్థాపన (అంచనా వ్యయం : రూ. 200 కోట్లు), పొచ్చెర గ్రామంలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన (అంచానా వ్యయం : రూ. 45.15 కోట్లు), శ్రీ నాగోబా దేవస్థానం అభివృద్ధి & సుందరీకరణ ప్రాజెక్టుకు శంకుస్థాపన (అంచనా వ్యయం: రూ. 20.10 కోట్లు),
ఆదిలాబాద్ నియోజకవర్గంలో తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాల & జూనియర్ కళాశాల (బాలికలు) భవనానికి ప్రారంభోత్సవం (అంచనా వ్యయం : రూ. 20 కోట్లు), సిరికొండ మండలం కొండాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన వంతెన ప్రారంభోత్సవం (అంచనా వ్యయం : రూ 13.46 కోట్లు), ఖానాపూర్ నియోజకవర్గం ఉట్నూర్ లో ఐటీడీఏ నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన (రూ 15.00 కోట్లు), బోథ్ నియోజకవర్గం ఇచ్చోడ రోడ్డు నుండి డెడ్రా గ్రామం రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన (అంచనా వ్యయం: రూ 30.00 కోట్లు), ఆదిలాబాద్ నియోజకవర్గం జైనథ్ లో మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల గురుకుల విద్యా పాఠశాల (బాలురు) భవనానికి ప్రారంభోత్సవం (అంచనా వ్యయం: రూ 20.00 కోట్లు) , ఆదిలాబాద్ మున్సిపాలిటీలో 38 వివిధ రకాల అభివృద్ధి పనులకు శంకుస్థాపన (అంచనా వ్యయం: రూ 30 కోట్లు). బోథ్ నియోజకవర్గం ధన్నూర్, కుప్టి, కుచ్లాపూర్ లలో (3) 33/11KV విద్యుత్ ఉపకేంద్రాల నిర్మాణానికి శంకుస్థాపన (అంచనా వ్యయం: రూ 8.99 కోట్లు), బోథ్ నియోజకవర్గంలో పిప్రి ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన (అంచనా వ్యయం: రూ 50.70 కోట్లు), బోథ్ నియోజకవర్గంలో తేజాపూర్ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన (రూ 44.64 కోట్లు)
ఖానాపూర్ నియోజకవర్గం ఇంద్రవెల్లి మండలంలో ముత్నూర్ చిన్న లిఫ్ట్ ఇరిగేషన్ (త్రివేణి సంగం) పథకానికి శంకుస్థాపన (అంచనా వ్యయం: రూ 65.85 కోట్లు), ఆదిలాబాద్ నియోజకవర్గంలో లాండసాంగి పంప్ హౌస్ దగ్గర చెక్ డ్యాం నిర్మాణానికి శంకుస్థాపన (అంచనా వ్యయం: రూ 6.435 కోట్లు), ఖానాపూర్ నియోజకవర్గం సిరికొండ మండలంలో చిక్ మన్ వాగు ప్రాజెక్ట్ నిర్మాణానికి శంకుస్థాపన (అంచనా వ్యయం: రూ 31.52 కోట్లు) , కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం అమ్మనమడుగు వాగు ప్రాజెక్ట్ రిపేర్ పనులకు శంకుస్థాపన (అంచనా వ్యయం: రూ 11.76 కోట్లు



