- Advertisement -
మరి కాసేపట్లో మేడిగడ్డకు బయల్దేరునున్న సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు
హైదరాబాద్:ఫిబ్రవరి 13
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, మంత్రుల తోపాటు ఎమ్మెల్యేలంతా మేడిగడ్డ బ్యారేజీని సందర్శించడానికి బయల్దేరనున్నారు.
అసెంబ్లీ దగ్గర నాలుగు ప్రత్యేక బస్సులను కూడా సిద్ధం చేశారు. అసెంబ్లీకి హాజరైన అనంతరం అందరూ కలిసి మేడిగడ్డకు బయలుదేరుతారు.
మధ్యహాన్నం 3 గంటలకు బ్యారేజీ వద్దకు చేరుకొను న్నారు. 2 గంటల పాటు సైట్ విజిట్ చేయనున్నారు. అక్కడే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉండనుంది.
ఆ తర్వాత సాయంత్రం 5 గంటలకు తిరిగి హైదరా బాద్‌కు బయలుదేరు తారు…
- Advertisement -


