దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రకటించిన సంగతి తెలిసిందే.ఎన్నికలు సమీపిస్తుండడంతో ఆయా పార్టీలు గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి.
ఈ క్రమంలో జమ్ము కశ్మీర్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు.
జమ్ము కాశ్మీర్ ఎన్నికల ప్రచారంలో 27 మంది స్టార్ కాంపేయనర్లు పాల్గొన్నారు. అందుకు సంబంధించిన జాబితాను ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కే.సీ వేణుగోపాల్.. కేంద్ర ఎన్నికల సంఘం కార్యదర్శికి అందజేశారు. ఇక ఆ జాబితాలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఇక కేంద్ర పాలిత ప్రాంతం జమ్ము కాశ్మీర్‌లో ఏప్రిల్ 19న ఉదంపూర్‌లో.. ఏప్రిల్ 26న జమ్ములో.., మే 7న అనంతనాగ్, రాజోరీల్లో.., మే 13న శ్రీనగర్‌లో.., మే 20న బారాముల్లాలో జరగనున్నాయి.