- Advertisement -
తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త ..సన్నవడ్లపై కీలక ప్రకటన*
CM Revanth Reddy good news for Telangana farmers..
ధాన్యం కొనుగోళ్లలో తాలు, తరుగు, తేమ పేరుతో రైతులను మోసం చేస్తున్న వారి క్రిమినల్ కేసులు పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.అవసరమైన చోట కొత్త ఐకేపీ కేంద్రాలను ఏర్పాటు సూచించారు. ఈ సీజన్ నుంచే ప్రభుత్వం సన్న వడ్లకు ఒక్కో క్వింటాలుకు రూ. 500 బోనస్ చెల్లిస్తుందని స్పష్టం చేశారు.
ధాన్యం కొనుగోలులో వ్యవసాయ అధికారులు భాగస్వామ్యం కావాలని కలెక్టర్లు, క్షేత్రస్థాయిలో పరిశీలించాలని తెలిపారు. రోజూ రెండు గంటల సమీక్షించాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ధాన్యం కొనుగోళ్లపై కాల్ సెటర్ ఏర్పాటు చేయాలని తెలిపారు. రాష్ట్రంలో రైతులు అందరూ సన్న బియ్యం పండించేలా అధికారులు చొరవ చూపించాలని సీఎం సూచించారు.
డీఎస్సీకి ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన రేపటి వరకు పూర్తి చేయాలని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి. అక్టోబర్ 9న నియామక పత్రాలను అందజేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుత సీజన్ లో 66. 73 లక్షల ఎకరాల్లో వరసాగు చేయగా రికార్డు స్థాయిలో 140 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ధాన్యం అమ్మిన రైతులకు 48 గంటల్లో వారి ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు ప్రభుత్వం చేస్తోంది.
- Advertisement -