Saturday, February 14, 2026

చొప్పదండిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ రెడ్డి

- Advertisement -

చొప్పదండిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ రెడ్డి
కరీంనగర్

CM Revanth Reddy laid the foundation stone for several development works in Choppadandi
CM Revanth Reddy laid the foundation stone for several development works in Choppadandi

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం నాడు చొప్పదండి లో పర్యటించారు. పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేపారు. ఈ కార్యక్రమాలకు మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హజరయ్యారు.
ముందుగా రూ.45.15 కోట్లతో కరీంనగర్ జిల్లా రామడుగులో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్, రూ. 5 కోట్లతో కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్ లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన చేసారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ మీ అందరి ఆశీర్వాదం తో ఉత్తర తెలంగాణ లోని కరీంనగర్ జిల్లాలో 13 కి 8 మంది శాసన సభ్యులను గెలిపించారు. గత 10 సంవత్సరాలుగా ఈ ప్రాంతం నిర్లక్ష్యానికి గురైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో విద్యా, వైద్యం, ఇరిగేషన్ అన్ని రంగాల్లో జిల్లాను అనుభవజ్ఞులైన ఇంచార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారధ్యంలో జిల్లాను అగ్రగామిగా ఉంచే ప్రయత్నం లో అభివృద్ధి కార్యక్రమంలో శాసన సభ్యులు, మంత్రులం కలిసి వెళ్తున్నాం. నేరుగా పేద ప్రజల ఇళ్లకు వెళ్తున్న సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్న  ప్రభుత్వం మీద అసహనంతో మాట్లాడుతున్న ప్రతిపక్షాలు చూస్తున్నామని అన్నారు.
శాసనసభ ఎన్నికల్లో మీ ఆశీర్వాదం తో ప్రజా పాలన ప్రభుత్వం ఏర్పడింది గత పార్లమెంట్ ఎన్నికల్లో మీకు సున్నా సీట్లు ఇచ్చారు..  ఉప ఎన్నికలు,సర్పంచ్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి  నాయకత్వంలో ఉన్న ప్రజా పాలన ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆశీర్వదించి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించండి. ఉమ్మడి జిల్లాలో ప్రతి మున్సిపాలిటీ లో కాంగ్రెస్ పార్టీ నీ గెలిపించాలి. ప్రధాన మంత్రి స్వయంగా తెలంగాణ పట్ల వివక్షపూరితంగా మాట్లాడారు బీజేపీ నేతలు స్పందించలేదు, ప్రజా పాలన ప్రభుత్వం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి, మంత్రులు ప్రధాన మంత్రి నీ బడ్జెట్ లో అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు కేటాయించాలని కలిసి విజ్ఞప్తి చేశాం రెండు బడ్జెట్  లలో నిధులు కేటాయించలేదు. తెలంగాణ పై విషం చిమ్ముతున్న  పవన్ కళ్యాణ్ తో తెలంగాణ బీజేపీ పొత్తుపెట్టుకొనిపెట్టుకొని ప్రజల్లోకి వస్తుంది. తెలంగాణ కి నిధులు ఇవ్వకుండా చిన్నచూపు చూస్తున్నారు.  తెలంగాణ కల్లుపడితే ఆంధ్రా కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయని విమర్శించారని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్