సీఎం రేవంత్ రెడ్డి,మంత్రి శ్రీధర్ బాబు, మంద కృష్ణ చిత్ర పటాలకు పాలాభిషేకం
CM Revanth Reddy, Minister Sridhar Babu, Manda Krishna's pictures are blessed
మంథని
ఎస్సీ వర్గీకరణను ఆమోదించి మాదిగ మాదిగ ఉపకులాలకు 9 శాతం రిజర్వేషన్ కేటాయించినందుకు కృతజ్ఞతగా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో బుధవారం మంథని పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, మందకృష్ణ మాదిగ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి అనంతరం స్వీట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు మంథని రాకేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మంథని రాకేష్,ఎస్సీ సెల్ డివిజన్ అధ్యక్షులు మంథని సత్యం మాట్లాడుతూ గత 30 సంవత్సరాల పాటుగా ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ లేకపోవడం వల్ల మాదిగలు మాదిగ ఉపకులాలు విద్య రంగం ఉద్యోగం ఉపాధి రంగాలలో తీవ్రంగా నష్టపోయారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ షమీం అక్తర్ ఏకసభ్య కమిషన్ నివేదిక ఆధారంగా ఫిబ్రవరి ఒకటో తేదీన రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ప్రకటన ఇచ్చిందన్నారు. మంగళవారం జరిగిన క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో ఏక సభ్య కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా వర్గీకరణను ఆమోదింపజేసుకొని శాసనమండలి ద్వారా ఆమోదించి 3 దశాబ్దాల ఉద్యమానికి న్యాయం జరిగిందని అన్నారు. అంతిమంగా మాదిగల ధర్మ బద్ధమైన కోరికకు ఆమోదముద్ర వేయడం యావత్ మాదిగ మరియు ఉపకులాలు ఈ నిర్ణయాన్ని హర్షిస్తున్నాయని అన్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఐలి ప్రసాద్ మాట్లాడుతూ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రత్యేక చొరవ ద్వారానే ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ సాధ్యమైందని, వర్గీకరణకు కృషిచేసిన శ్రీధర్ బాబు కు మంథని నియోజకవర్గ మాదిగ మాదిగ ఉపకులాల తరఫున మంథని మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ బూడిద శంకర్ మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షులు అక్కపాక శంకర్, కాంగ్రెస్ పార్టీకి చెందిన మాదిగ నాయకులు బూడిద తిరుపతి, తోకల మల్లేష్, వేల్పుల రాజు, మంథని కరుణకృష్ణ, బూడిద రమేష్, మంథని సమ్మయ్య, కొయ్యల మొండి, అక్కపాక సది, కాశిపేట బాపు, రోడ్డ రాజేశ్వరరావు, కన్నూరి ఓదెలు, బూడిద రంజిత్, మంథని శ్రీనివాస్, కన్నూరి రవి, కలువల రాజేశం, మాదిగ నాయకులు పాల్గొన్నారు.


