హైదరాబాద్ లో స్మార్ట్ పోల్స్ ఏర్పాటుపై అధ్యయనం చేయాలి              అధికారులకు సిఎం రేవంత్ రెడ్డి ఆదేశం

- Advertisement -

హైదరాబాద్ లో స్మార్ట్ పోల్స్ ఏర్పాటుపై అధ్యయనం చేయాలి
             అధికారులకు సిఎం రేవంత్ రెడ్డి ఆదేశం
హైదరాబాద్ ఫిబ్రవరి 17

CM Revanth Reddy orders officials to study setting up smart polls in Hyderabad
హైదరాబాద్ లో స్మార్ట్ పోల్స్ ఏర్పాటుపై అధ్యయనం చేయాలని అధికారులకు సిఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ట్రాఫిక్ అధికంగా ఉన్న చోట స్కెవాక్ బ్రిడ్జిలు, అవసరమైన చోట పిపిపి విధానంలో స్కెవాక్ లు నిర్మించాలని అన్నారు. పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధిశాఖపై, సిఎస్, సిఎంవొ సెక్రటరీ, హెచ్ఎండిఎ కమిషనర్ తో సిఎం సమీక్షించారు. జిహెచ్ఎంసి విభజనలో తలెత్తిన సమస్యల పరిష్కారాలు సూచించారు. నెక్లెస్ రోడ్ రైల్వే స్టేషన్ వద్ద మల్టీలెవల్ కార్ పార్కింగ్ ఏర్పాటు చేయాలని, ప్రకటన బోర్డుల ఏర్పాటుపై జాగ్రత్తలు తీసుకోవాలని సిఎం ఆదేశాలిచ్చారు. ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా చర్యలు ఉండాలని, ప్రభుత్వ కార్యక్రమాల కోసం 10 శాతం ప్రకటన బోర్డులు కేటాయించాలని అన్నారు. అడ్వర్టెజింగ్ బోర్డుల నుంచి ఏడాదికోసారి ఫీజు వసూలు చేయాలని, నగరంలో వీధిదీపాల నిర్వహణలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మూడు కార్పొరేషన్లలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని, హైదరాబాద్ లో త్వరలో ప్రతి జోన్ లో పర్యటిస్తానని తెలియజేశారు. రోడ్లు శుభ్రంగా లేకుంటే అధికారులను సస్పెండ్ చేస్తామని, కమీషనర్లు, జోనల్ కమిషనర్లు పొద్దున్నే ఫీల్డ్ లో ఉండాలని రేవంత్ రెడ్డి పేర్కొన్నా

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular