- Advertisement -
విద్యారంగాన్ని పట్టించుకోని సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy who does not care about the education sector
హైదరాబాద్
సీఎం రేవంత్కు విద్యా వ్యవస్థపై పట్టింపే లేదని .రాష్ట్ర ప్రభుత్వం విద్యను తీవ్ర నిర్లక్ష్యం చేస్తూ పేద, మధ్య తరగతి విద్యార్థులను చదువుకు దూరం చేస్తోందని తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్స్ అసోసియేషన్ నేతలు ధ్వజమెత్తారు. ప్రభుత్వ తీరుకు నిరసన చేపట్టారు. రాష్ట్రానికి విద్యామంత్రి లేరని, ముఖ్యమంత్రికి విద్యావ్యవస్థపై పట్టింపు లేదని వ్యాఖ్యానించారు. అసలు విద్యా వ్యవస్థలో ఏం జరుగుతుందో రేవంత్ రెడ్డికి తెలుసా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాఠశాల విద్యను తీవ్ర నిర్లక్ష్యం చేస్తూ పేద, మధ్య తరగతి విద్యార్థులను చదువుకు దూరం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తూ పేద, మధ్య తరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాల్సిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టకుండా స్కూళ్లను మూసి వేయాలని భావించడం సిగ్గుచేటని ఘాటుగా వ్యాఖ్యానించారు. 12 నెలల కాలంలోనే ప్రభుత్వ విద్యను కాంగ్రెస్ సర్కార్ అస్తవ్యస్థం చేసిందని మండిపడ్డారు. సరైన మౌలిక వసతులు లేకపోవటం, నాణ్యమైన ఆహారం అందించకపోవడం, పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాల్లో శుభ్రత, భద్రత లేని పరిస్థితి నెలకొనటంతో ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలంటేనే తల్లితండ్రులు భయపడే పరిస్థితిని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందని ఆయన దుయ్యబట్టారు. గత కొన్నాళ్లుగా గురుకులాల్లో జరుగుతున్న సంఘటనలు, వసతి గృహాల్లో విషాహారం, భద్రత లేని పరిస్థితులు, విద్యార్థులు లేరంటూ పాఠశాలలను మూసివేస్తున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. ఇది తెలంగాణ సమాజానికి ఎంతమాత్రం మంచిది కాదన్నారు.
- Advertisement -