Monday, February 16, 2026

హైస్పీడ్ రైల్వే ప్రాజెక్టులపై సీఎం రేవంత్‌రెడ్డి స్పెషల్ ఫోకస్

- Advertisement -

హైస్పీడ్ రైల్వే ప్రాజెక్టులపై సీఎం రేవంత్‌రెడ్డి స్పెషల్ ఫోకస్

CM Revanth Reddy's special focus on high-speed railway projects

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇవాళ(గురువారం) ఉదయం 11 గంటలకు పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. మొదట మూడు ప్రతిపాదిత హై స్పీడ్ రైల్వే ప్రాజెక్టులపైన సమీక్ష చేయనున్నారు సీఎం. తెలంగాణ మీదుగా మూడు హైస్పీడ్ రైలు మార్గాలకు ప్రణాళికపై అధికారులతో మాట్లాడనున్నారు.

హైదరాబాద్ – చెన్నై, హైదరాబాద్ – బెంగళూరు మార్గాలకు ప్రభుత్వం ఇప్పటికే అలైన్‌మెంట్లు ఖరారు చేసింది. ఇంకా ప్రతిపాదన దశలోనే హైదరాబాద్ – అమరావతి హైస్పీడ్ రైలు మార్గం ఉంది. ఈ అలైన్ మెంట్‌పై కూడా అధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి చర్చించనున్నారు. ఈ సమీక్షలో రైల్వే ముఖ్య ఇంజనీర్లు, సంబంధిత అధికారులు పాల్గొననున్నారు. వికారాబాద్ – కృష్ణా, డోర్నకల్ – గద్వాల, కల్వకుర్తి – మాచర్ల మార్గాలపై కూడా మాట్లాడనున్నారు సీఎం రేవంత్‌రెడ్డి.

అలాగే, రీజనల్ రింగ్ రైల్వే ప్రాజెక్టుపైనా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రీజినల్ రోడ్డుకు సమాంతరంగా రైలు అలైన్‌మెంట్ ప్రతిపాదనపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. గ్రూప్-1పై (Group 1) సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేయడంపై సమీక్ష చేసే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ హైకోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలనే ఆలోచనలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంది. ఈ విషయంపై కూడా సీఎం రేవంత్‌రెడ్డి చర్చించే అవకాశాలు ఉన్నాయి..

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్