Monday, March 30, 2026

గోద్రెజ్ అగ్రోవెట్ కంపెనీతో సీఎం  రేవంత్ చర్చలు

- Advertisement -
CM Revanth talks with Godrej Agrovet Company

హైదరాబాద్
గోద్రెజ్ అగ్రోవెట్ కంపెనీ ప్రతినిధి బృందం రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డితో భేటీ అయింది. తెలంగాణలో ఇప్పటికే ఈ కంపెనీ పలు వ్యాపారాలు నిర్వహిస్తోంది. వంట నూనెలు, డెయిరీ, అగ్రో, వెటర్నరీ సర్వీసెస్, అగ్రో

కెమికల్స్, పశువుల దాణా, వెటర్నరీ సర్వీసెస్ రంగాల్లో బిజినెస్ కొనసాగిస్తోంది. మలేషియాకు చెందిన సిమ్ డార్బీ కంపెనీతో కలిసి ఖమ్మం జిల్లాలో ఇంటిగ్రేటేడ్ ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ కాంప్లెక్స్ ను ఈ కంపెనీ ఏర్పాటు

చేస్తోంది.  మంగళవారం సెక్రెటేరియట్లో గోద్రెజ్ అగ్రోవెట్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం సింగ్ యాదవ్ తో పాటు కంపెనీ ప్రతినిధులు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డితో చర్చలు జరిపారు. తెలంగాణలో రియల్ ఎస్టేట్,

ఫర్నీచర్, కన్సూమర్ గూడ్స్ రంగాల్లో ఉన్న అపారమైన అవకాశాలను పరిశీలించాలని  ముఖ్యమంత్రి కంపెనీ ప్రతినిధులకు సూచించారు.
ఇప్పటికే కంపెనీ చేపట్టిన ఆయిల్ పామ్, డెయిరీ బిజినెస్ ను మరింత విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా స్కిల్ డెవలప్మెంట్ ను

ప్రోత్సహించాలని కంపెనీ ప్రతినిధులకు ఆయన సూచించారు. ఈ సమావేశంలో  ముఖ్యమంత్రితో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో పాటు సంబంధిత శాఖ

అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్