ధరణిపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు…!

- Advertisement -

ధరణిపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు…!

CM Revanth’s key orders on Dharani…!

హైదరాబాద్: ధరణి సమస్యల పరిష్కారానికి మరింత లోతుగా అధ్యయనం చేయాలని అధికారులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు. కేసీఆర్ ప్రభుత్వంలో ధరణి పోర్టల్ విషయంలో రైతులు నానా ఇబ్బందులు పడిన విషయం తెలిసిందే. అయితే కాంగ్రెస్ ప్రభుత్వంలో అలాంటివేమి ఉండకూడదని భావించిన రేవంత్.. శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపడుతున్నారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో ధరణి సమస్యలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో ధరణిపై పలు అంశాలపై సీఎం రేవంత్ సంబంధిత అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. సవరణలపై కొత్త సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. సవరణలపై ప్రజాభిప్రాయం పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. అఖిలపక్ష సమావేశం నిర్వహించి అభిప్రాయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి వివరించారు. ప్రజల అభిప్రాయాలు, సూచనల ఆధారంగా సమగ్ర చట్టం రూపొందించాలని సూచించారు. అవసరమైతే అసెంబ్లీలోనూ చర్చ పెడదామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు.

ధరణిపై కీలకంగా చర్చించిన ఈ సమావేశంలో మంత్రి పొంగులేటి, ప్రభుత్వ సలహాదారు కే. కేశవరావు, జానారెడ్డి, ధరణి కమిటీ సభ్యులు కోదండ రెడ్డి, సునీల్, సీఎస్‌ ధరణిలో సమస్యలు, మార్పులు-చేర్పులపై సీఎం రేవంత్‌రెడ్డితో చర్చించారు..

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular