విద్యాశాఖపై సీఎం రేవంత్ సమీక్ష

- Advertisement -

విద్యాశాఖపై సీఎం రేవంత్ సమీక్ష
హైదరాబాద్

CM Revanth’s review on education
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం నాడు విద్యాశాఖ పై సమీక్ష నిర్వహించి, అధికారులకు పలు సూచనలు, పలు అంశాలపై దిశానిర్ధేశం చేశారు.
సీఎం మాట్లాడుతూ కోర్ అర్బన్ రీజియన్ లోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన పై దృష్టి సారించాలి. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలల నిర్మాణంలో రాజీ పడొద్దు.భారతీయ విద్యా భవన్, జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూళ్ల తరహాలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు ఉండాలని అన్నారు.
ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలలో బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ ను పకడ్బందీగా అమలు చేయాలి. ఈ స్కీంలో అందించే పాలను విజయా డైరీ నుంచి సేకరించాలి. కోర్ అర్బన్ రీజియన్ మినహా ఇతర నియోజకవర్గాలలో  పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు రవాణా సదుపాయం కల్పించాలి. దీని కోసం ఎలక్ట్రిక్ బస్ లను సమకూర్చుకోవడం పై అధ్యయనం చేయాలి.
ప్రైవేట్ స్కూల్స్ లో నిబంధనలకు మించి ఫీజులు వసూలు చేస్తే అనుమతి రద్దు తో పాటు రికవరీ చేసేలా నిబంధనలు రూపొందించాలి. ఫీజుల నియంత్రణ కు సంబంధించి రికమండేషన్స్ ని ప్రజాభిప్రాయం కోసం వెబ్ సైట్లలో పెట్టాలని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular