- Advertisement -
ఈ నెల 28న వరంగల్‌లో సీఎం రేవంత్ పర్యటన
హైదరాబాద్
ఈ నెల 28న వరంగల్ నగరంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. నగరం అభివృద్ధిపై ముఖ్యమంత్రి దృష్టి సారించనున్నారు. అభివృద్ధి పనులపై ఈనెల 28న హనుమకొండ కలెక్టరేట్‌లో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. కూడా పరిధిలో చేపట్టబోయే అండర్ డ్రైనేజీ పనులతో పాటు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రజాప్రతినిధులతో పాటు అధికారులతో ఉదయం నుంచి సాయంత్రం వరకు వరంగల్‌లోనే సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.
- Advertisement -