Sunday, December 22, 2024

సీఎం వ్యూహాత్మకంగా అడుగులు

- Advertisement -

సీఎం చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు
విశాఖపట్టణం, ఆగస్టు 7

CM steps strategically

ఉమ్మడి విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలపై ఏపీ సీఎం చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఉత్తరాంధ్రలో బలమైన నాయకుడైన బొత్స సత్యనారాయణ వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగడంతో.. ఆయనను ఓడించాలనే పట్టుదలతో కూటమి పావులు కదుపుతోంది. ఉమ్మడి విశాఖలో వైసీపీకి మొత్తం 586 ఓట్లు ఉన్నాయి. దీంతో ఆ పార్టీ నేతలు గెలుపు ధీమాతో ఉన్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లా వైసీపీ నేతలతో బొత్స రహస్యంగా భేటీ అయినట్లు సమాచారం.స్థానిక సంస్థల్లో టీడీపీకి మాత్రం 237 ఓట్లే ఉన్నాయి. మరో 200 ఓట్లను రాబట్టేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు కూటమి నేతలు. ఈ మేరకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఇంట్లో స్పీకర్ అయ్యన్న పాత్రుడు, జనసేన, బీజేపీ నేతలు సమావేశమయ్యారు. అరకు, పాడేరు నియోజకవర్గాల నుంచి ఎంపీటీసీ, జడ్పీటీసీల చేరికలే టార్గెట్ గా మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది.టీడీపీ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా గండి బాబ్జి, పీల గోవిందు, కోరాడ రాజబాబు పేర్లు పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరితో పాటు మరో ఆరుగురి పేర్లను పల్లా శ్రీనివాస్.. సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలని టీడీపీ నిర్ణయించింది. ఈ మేరకు అభ్యర్థి ఎంపికపై నేతలు కసరత్తు ప్రారంభించారు. అనకాపల్లిలో సీఎం రమేశ్ ఇంట్లో గ్రామీణ ప్రాంత నేతలంతా సమావేశం అయ్యారు. విశాఖ పార్లమెంట్ అధ్యక్షుడు గండి బాబ్జీ, అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ టీడీపీ అభ్యర్థి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలోకి దిగేందుకు సిద్ధం అయ్యారు. మాడుగుల నుంచి టీడీపీ ఇంచార్జి విజయ్ కమార్ తనకు అవకాశం ఇవ్వాలని కోరినా.. గండి బాబ్జీ, పీలా గోవింద్ ఎంపికపై ఉత్కంఠ నెలకొంది. అనకాపల్లి స్థానంలో జనసేన నేత కొణతాల రామకృష్ణ అభ్యర్థిగా బరిలోకి దిగడంతో తన సీటును త్యాగం చేశారు పీలా గోవింద్. అలాగే జనసేన నుంచి వంశీ కృష్ణ దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేయడంతో గండి బాబ్జీ సైతం తన సీటును త్యాగం చేశారు. వీరిద్దరి వైపే అధిష్టానం మొగ్గు చూపే అవకాశం కనిపిస్తోంది. గాజువాక ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఇంట్లో ఉమ్మడి జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు, విశాఖ, అనకాపల్లి, అరకు పార్లమెంట్ కు సంబంధించిన నేతలు సైతం ఈ భేటీకి హాజరయ్యారు. జెడ్పీటీసీలు, ఎంపీటీసీలను పార్టీలోకి ఆహ్వానించి ఈ ఎమ్మెల్సీ స్థానాన్ని ఏ విధంగానైనా దక్కించుకోవాలని టీడీపీ పట్టుదలగా ఉంది. కానీ అర్థికంగా బలమైన నేత.. అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీల గోవిందుని అభ్యర్థిగా ప్రకటించేందుకు అధిష్ఠానం మొగ్గు చూపుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. తమవాళ్లను కాపుడుకునే పనిలో వైసీపీ నేతలు బిజీ అయ్యారు. అదే సమయంలో సాధ్యమైనంత ఎక్కువ మందిని చేర్చుకునేందుకు కూటమి తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.కౌన్సిల్ ఏర్పడిన దగ్గరి నుంచి ఇప్పటివరకు మూడుసార్లు జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరగ్గా.. ఒక్కసారి కూడా ఒక్క స్థానంలో కూడా టీడీపీ కార్పొరేటర్లు గెలవలేదు. జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో విజయం సాధిస్తే స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో సునాయాసంగా గెలవొచ్చని చూస్తున్నాయి ఇరు పార్టీలు. జీవీఎంసీ వైసీపీ కార్పొరేటర్లతో వైవీ సుబ్బారెడ్డి భేటీ అయ్యారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ, స్టాండింగ్ కమిటీ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి విశాఖ జిల్లా నేతలతో వైసీపీ అధినేత జగన్ భేటీ కాబోతున్నారు. ఎన్నికల్లో గెలిచేందుకు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయబోతున్నారు జగన్.జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలను అటు కూటమి సర్కార్, ఇటు వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. రేపు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 10 స్థానాలకు ఈ ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో కనీసం 5 స్థానాలైనా కైవసం చూసుకోవాలని వైసీపీ చూస్తుంటే.. 10కి 10 స్థానాలను కైవసం చేసుకోవాలని కూటమి సర్కార్ పట్టుదలగా ఉంది. కౌన్సిల్ ఏర్పడి ఇప్పటివరకు మూడుసార్లు స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరిగినప్పటికీ.. ఇప్పటివరకు కూడా ఒక్క స్టాండింగ్ కమిటీ మెంబర్ కూడా కూటమి ప్రభుత్వానికి రాలేదు. ఈ నేపథ్యంలో ఈసారి 10కి 10 స్థానాలు కైవసం చేసుకోవాలని చూస్తోంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్