చిరు వ్యాపారాలను సహకార బ్యాంకులు ప్రోత్సహించాలి
Co-operative banks should encourage small businesses
హైదరాబాద్
ప్రధాని మోదీ ప్రభుత్వం ఎంఎస్ ఎంఈ ద్వారా అందిస్తున్న వడ్డీ లేని రుణాలు మాదిరిగా సహకార బ్యాంకులు చిరు వ్యాపారులకు. చిన్న తరహా పరిశ్రమలకు అందించి ప్రోత్సాహించాలని త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనా రెడ్డి కోరారు. మలక్ పేట లో నిర్వహించిన తిరుమల బ్యాంక్ 27వ వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. తక్కువ వడ్డీ రేట్లకు రుణాలందించే సహకార బ్యాంకు ద్వారా పేద ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.
ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడంలో సహకార బ్యాంకింగ్ వ్యవస్థ తనదైన ముద్రను వేసిందని తెలిపారు. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు బ్యాంక్ చైర్మన్ చంద్రశేఖర్ అందిస్తున్న సేవలను కొనియాడారు. చిన్న బ్యాంకుల మీద ఎక్కువ దృష్టి పెట్టాలని, చిన్న వినియోగదారులకు చక్కటి సేవలు అందించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, మల్లికార్జునరావు, దుర్గాప్రసాద్, గోపికృష్ణ మానేపల్లి, రామన్న దొర,హరిహర కుమార్, బ్యాంక్ డైరెక్టర్లు, ఖాతాదారులు, వినియోగదారులు తదితరులు హాజరయ్యారు. అనంతరం మొబైల్ యాప్ ను ప్రారంభించారు.


