Sunday, September 8, 2024

నేటి నుండి ఎన్నికల ప్రవర్తన నియమావళి

- Advertisement -

జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్

హైదరాబాద్, అక్టోబర్ 09:   భారత ఎన్నికల సంఘం తెలంగాణ రాష్ట్ర ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి నేటి నుండి అమల్లోకి వచ్చిందని హైదరాబాద్ ఎన్నికల అధికారి, జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ వెల్లడించారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో సోమవారం జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో హైదరాబాద్ జిల్లాలో చేసిన ఎన్నికల ఏర్పాట్లపై పోలీస్ కమీషనర్ సి.వి. ఆనంద్ తో కలిసి ఎన్నికల అధికారి విలేకరుల సమావేశం నిర్వహించారు.

Code of Conduct for Elections from today
Code of Conduct for Elections from today

ఈ సందర్భంగా హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ మాట్లాడుతూ… కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో నవంబర్ 3వ తేదీ నుంచి సంబంధిత నియోజకవర్గాల ఆర్.ఓ లు నామినేషన్లు స్వీకరించబడుతుంది. నామినేషన్ చివరి తేదీ నవంబర్ 10వ తేదీ, నామినేషన్ల పరిశీలన నవంబర్ 13, నామినేషన్ విత్ డ్రా నవంబర్ 15వ తేదీ, నవంబర్ 30వ తేదీన పోలింగ్ జరుగుతుందని, డిసెంబర్ 3 ఎన్నికల కౌంటింగ్, డిసెంబర్ 5వ తేదీన ఎన్నికల ప్రక్రియ ముగుస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఒకటి ఎస్సీ రిజర్వ్ ఉండగా మిగతా జనరల్ ఉన్నాయని తెలిపారు.

జిల్లాలో అక్టోబర్ 4వ తేదీన ప్రచురించిన తుది ఓటరు జాబితా ప్రకారం మొత్తం 44,42,458 ఓటర్లు ఉండగా అందులో పురుషులు 22,79,617 ఉండగా మహిళలు 21,62,541, ఇతరులు 300 ఓటర్లు ఉన్నారని తెలిపారు. ఇందులో సర్వీస్ ఓటర్లు 404, ఎన్నారై ఓటర్లు 847, దివ్యాంగులు 24,163, వృద్ధులు 80 సం. పైబడిన ఓటర్లు 83,588 ఉన్నారు.

ఎన్నికల్లో వినియోగించే ఈ.వి.ఎం ల ఫస్ట్ లెవల్ చెకప్ పూర్తి చేసి  భద్రపరచడం జరిగిందని తెలిపారు. ఈ.వి.ఎం, వీవీ ప్యాట్ పై అవగాహన కల్పించడం జరుగుతున్నది. అందుకోసం 16 నియోజకవర్గ పరిధిలో ఆయా ప్రదేశాల్లో ఈ.వి.ఎం, వి.వి ప్యాట్ ల పై ఇప్పటి వరకు 15,158 మందికి అవగాహన కల్పించడం జరిగింది.  15 మొబైల్ క్యాంప్ ల ద్వారా ఈ.వి.ఎం, వి.వి. ప్యాట్ లపై  28,106 మందికి విస్తృతంగా అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందన్నారు.  హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా 1,688 లొకేషన్లలో 3,986 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.

Code of Conduct for Elections from today
Code of Conduct for Elections from today

ఓటర్లకు సందేహాలు నివృత్తి చేయడానికి జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో కంట్రోల్ రూం ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఇందులో భారత ఎన్నికల సంఘం 1950 టోల్ ఫ్రీ నెంబర్, 1800-599-2999 నెంబర్లు 24 గంటల పాటు పనిచేస్తుందని తెలిపారు. సి-విజిల్ యాప్ ద్వారా మోడల్ కోడ్ లో ఉల్లంఘన జరిగిన సందర్భంలో ఈ సివిజిల్ ద్వారా ఫిర్యాదు వినియోగించుకోవచ్చు.  సి-విజిల్ ద్వారా వచ్చిన ఫిర్యాదులను 100 నిమిషాలలో పు పరిష్కరించి అదే యాప్ లో ఉంచుతామని తెలిపారు.

పొలిటికల్ పార్టీలు, పోటీలో ఉన్న అభ్యర్థులకు సువిధా సెంటర్ ద్వారా సింగిల్ విండో పర్మిషన్ ను అతి త్వరగా ఇచ్చేందుకు జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో అన్ కంట్రోల్ ఎయిర్ ఫోర్స్, హెలీ ప్యాడ్స్, కమర్షియల్, ర్యాలీలు, లౌడ్ స్పీకర్స్, పబ్లిక్ మీటింగ్ అనుమతి తప్పనిసరి అని తెలిపారు.

ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా అడ్వర్టైజ్మెంట్ సర్టిఫికెట్ ముందస్తుగా ఎం.సి.ఎం.సి కమిటీ అనుమతి తీసుకోవాలని, అదేవిధంగా ప్రింటింగ్ ప్రెస్ వారు కూడా ప్రింటింగ్ చేసిన పోస్టర్లు కానీ, కరపత్రాలు కానీ ప్రచురణ కర్త, ప్రచురణ చేసిన మొత్తం, దాని బిల్లును ఎం.సి.ఎం.సి కమిటీ కి అందజేయాలని కోరారు. వీటిని ఉల్లంఘించిన వారిపై ఎన్నికల ప్రవర్తన నియమావళి అనుసరించి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

ఎన్నికల ప్రవర్తన నియమావళిని అనుసరించి డబ్బు, మద్యం, అక్రమ రవాణా నిరోధించడానికి 90 ఫ్లయింగ్ స్క్వాడ్ లను ఏర్పాటు చేశామని తెలిపారు. పొలిటికల్ పార్టీలు చేసే ర్యాలీలు, మీటింగ్ లను వీడియో గ్రఫీ చేయడానికి 15 నియోజకవర్గాలలో ఒకొక్క నియోజకవర్గానికి ఒకొక్క  వీడియో సర్వైలెన్స్ టీమ్ లను ఏర్పాటు చేశామని తెలిపారు. ఎన్నికల సందర్భంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రొజిసర్ ను అనుసరించి నడుచుకోవాలని తెలిపారు.

పోలీస్ కమీషనర్ సి.వి.ఆనంద్ మాట్లాడుతూ… హైదరాబాద్ నగరంలో 1587 సమస్యత్మాక పోలింగ్ స్టేషన్లు గా గుర్తించడం జరిగిందని తెలిపారు. ఎన్నికల సందర్భంగా హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేసే ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులలో జి.ఎస్.టి. కమర్షియాల్ ట్యాక్స్, జిహెచ్ఎంసి, ఆర్టీఏ, ఎక్సైజ్, నార్కోటిక్స్ సంబంధిత అధికారులు 24 గంటల పాటు ఉంటారని అన్నారు. మద్యాన్ని అరికట్టడానికి మద్యం షాపుల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామన్నారు. మనీ ట్రాన్సఫర్ వాహనాలను జి.పి.ఎస్ సిస్టమ్ అమరుస్తామని తెలిపారు. ఎక్కువ మొత్తంలో డబ్బులు తరలించేవారు సంబంధిత ధృవపత్రాలు చూపించాలని, అట్టి డబ్బులు దేనికి వినియోగిస్తున్నారు పూర్తి వివరాలు చూపించాలని తెలిపారు. పరిమితి మించి ఎక్కువ మొత్తంలో డబ్బులు ట్రాన్సఫర్ అయిన అకౌంట్ల ను పరిశీలించడం జరుగుతుందని తెలిపారు. అందుకోసం ఆర్.బి.ఐ ఆయా బ్యాంకర్లతో సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. మరోసారి వారితో సమావేశం జరిపి ద్రవ్య నియంత్రణ కు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఓటర్లకు ఫ్రీ బిస్ ఇవ్వడం పై ప్రత్యేక దృష్టి పెడుతామని తెలిపారు. పోలీసు బందోబస్తు కోసం 32 కంపెనీల కేంద్ర బలగాలను అడిగినట్లు సి.వి ఆనంద్ తెలిపారు.

ఈ సమావేశంలో హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, ఈ.వి.డి.ఎం ప్రకాష్ రెడ్డి, జోనల్ కమిషనర్ వెంకటేష్ దొత్రె, అడిషనల్ కమిషనర్ శంకరయ్య, కంటోన్మెంట్ సీ.ఇ.ఓ మధుకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్