- Advertisement -
మెదక్ జిల్లాలో తప్పిన పెను ప్రమాదం
మెదక్: మెదక్ జిల్లా వడియారం గ్రామంలో పెను ప్రమాదం తప్పింది. గ్రామ శివారులో రామంతపూర్ తాండాకు వెళ్లే రోడ్డుపై రైల్వే బ్రిడ్జి గోడ ఒక్కసారిగా కూలింది. వర్షానికి ఒక్కసారిగా మట్టి కుంగిపోయి బండరాళ్లు రోడ్డుపై పడ్డాయి. ఆ సమయంలో రోడ్డుపై వాహనాలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటనతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

- Advertisement -



