కానరాని ధరల సూచిక
ప్రయివేటు ఆసుపత్రిలలో చార్జీలపై నియంత్రణ ఎది..
అందని ద్రాక్షాల ప్రయివేటు వైద్యం…
నిమ్మకు నీరెట్టినట్లు వ్యవహరిస్తున్నవైద్యశాఖ….
బోడుప్పల్, అక్టోబర్ 28 (వాయిస్ టుడే) : మేడ్చల్ నియోజకవర్గం మేడిపల్లి, బోడుప్పల్ లో గల ప్రతి ప్రయివేటు ఆసుపత్రిలో అనుమతులు తీసుకున్నప్పటి నుండి తప్పని సరిగా తాము తీసుకునె ధరల సూచిక ఆసుపత్రి వెలుపల ప్రజలకు కనిపించెటట్లు ఎర్పాటు చెయాలి. కాని మేడ్చెల్ జిల్లా మేడిపల్లి మండలంలో కోన్ని ప్రయివేటు ఆసుపత్రుల యాజమాన్యం ఇందుకు బిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఎన్నో ఎళ్ళ నుండి కోన్ని ఆసుపత్రులలో వారు తీసుకునె బిల్లులకు సంబందించిన ధరల సూచిక వివరాల బోర్డు ప్రజలకు కనిపించె విదంగా ఎర్పాటు చెయాలేదు.. కాని డబ్బే ద్యేయంగా నడుస్తున్న కోన్ని ఆసుపత్రుల యాజమాన్యం అందినకాడికి దోచుకుంటున్నారు. ఇష్టారీతిగా బిల్లులు వేసి చార్జీలు వసూళ్ళు చేస్తూ ఆమాయక పేద ప్రజలను మెుసగిస్తున్నారు, ఇంత జరుగుతున్న జిల్లా వైద్య అధికారులు నిమ్మకు నీరెట్టినట్టు వ్యవహరిస్తున్నారు. వైద్య అదికారులు అప్పుడప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నా కోందరి సిబ్బంది చేతివాటం ప్రతర్శించడంతో చర్యలకు వెనకడుగు వేస్తున్నరని వినికిడి..ప్రతి ఆసుపత్రి వారు వారి సేవలను, ఎర్పాట్లను బట్టి ధరల సూచిక సంబందించిన బోర్డు పెట్టాలి. కాని కోన్ని ఆసుపత్రులు ఆదిక మెుత్తంలో బిల్లులు వసూలు చేయాలనె ద్యేయంతో ఇందుకు బిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైన జిల్లా వైద్య అదికారి తనిఖీలు ముమ్మరం చేసి విచారణ జరిపి కారకులైన సిబ్బందిపై అలానె మేడిపల్లి మండలంలో వైద్యానికి సంబందించి ధరల సూచిక బోర్డులు పెట్టని ఆసుపత్రులపై చర్యలు తీసుకుని ప్రజలకు అందుబాటులో ఉండె ధరలకే వైద్యం అందేల చూడాలని ప్రజలు కోరుతున్నారు.