- Advertisement -
నిర్వాసిత రైతులతో కలెక్టర్ భేటీ
Collector meeting with displaced farmers
సిద్దిపేట
జిల్లాలో రీజనల్ రింగ్ రోడ్డు వలన భూమి కోల్పోతున్న ఆయా గ్రామాల రైతులతో జిల్లా కలెక్టర్ ఎం. మను చౌదరి సమావేశం నిర్వహించారు. భూమే ఆధారంగా వ్యవసాయమే బతుకుదెరువుగా జీవనం సాగిస్తున్నామని అలాంటి భూమిని రిజనల్ రింగ్ రోడ్డు కు తీసుకోవడం అత్యంత బాదకరమైనను ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఇవ్వడానికి సుముఖంగా నే ఉన్నా నష్ట పరిహారం విషయంలో ప్రత్యేక చోరవ చూపించి బహిరంగ మార్కెట్ లో ప్రస్తుతం ఉన్న ధరను ఆయా గ్రామాల వారిగా తెలుపుతు దానికనుగుణంగా తగినంత మొత్తంలో నష్టపరిహారం లేదా ల్యాండ్ పూలింగ్ లో మాదిరి అక్కడే రోడ్డు వెంబడి కొంత స్థలం అయిన ఇప్పించగలరని ఆయా గ్రామ రైతులు కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు.
ఈ సమావేశం లో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.
జిల్లాలోని గజ్వేల్ నియోజకవర్గం గుండా రీజనల్ రింగ్ రోడ్డు వెళ్తున్నందున ఈ ప్రాంత అభివృద్ధి కోసం భూమిని ఇవ్వడానికి ఒప్పుకోవడం శుభపరిణామం. ఆయా గ్రామాల్లో భూమి వ్యాల్యూ ను మీరు తెలిపిన వాటిని పూర్తిగా నోట్ చేసుకుని దీనిని రాష్ట్ర స్థాయి అధికారులకు పంపించి అందరికి న్యాయం చేయడానికి నా వంతు సహకారం అందిస్తానని హమీ ఇచ్చారు. అలాగే ల్యాండ్ పూలింగ్ గుర్చి కూడా అధికారులతో చర్చిస్తానని తెలిపారు.
- Advertisement -