చెరువులు, నీటి కుంటలపై కలెక్టర్ సమావేశం
సిద్దిపేట
Collector’s meeting on ponds and waterholes
ఎచ్ఎండిఎ పరిధిలోని జిల్లాలో గల మర్కుక్.. ములుగు.. వర్గల్ మండలాల్లో గల చెరువులు కుంటలకు సంబంధించిన భద్రత చర్యల చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎం. మను చౌదరి అధికారులను ఆదేశించారు.
గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కాన్ఫరెన్స్ హాల్ లో ఆయా మండల రెవెన్యూ, నీటిపారుదల, భూ,సర్వే అధికారులతో జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగ్రవాల్ తో కలిసి జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎచ్ఎండిఎ పరిధిలో జిల్లాలోని 3మండలాల్లో మొత్తం చెరువులు, కుంటలను సర్వే అధికారులు భూ-విస్తీర్ణం రికార్డులను పరీశిలించి మ్యాప్ లను సిద్ధం చెయ్యాలి. మండల రెవెన్యూ, భూ,సర్వే, నీటిపారుదల శాఖ అధికారులు ఆయా చెరువులు, కుంటల ప్రాంతాలను క్షేత్ర స్థాయిలో పరీశిలించాలి. ఆయా గ్రామా పంచాయతీలలో వాటి భూ సర్వే మ్యాప్, సర్వే నంబర్ లను గోడపై అతికించాలి. ఎచ్ఎండిఎ అధికారుల మార్గదర్శకాల ప్రకారం ఆయా గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి వాటి భద్రత చర్యల గుర్చి చర్చించాలని అదికారులకు తెలిపారు. అందరు అదికారులు సమన్వయంతో ఈ భద్రత చర్యలను చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ ఆర్డిఓ బన్సీలాల్, ఎడి సర్వేలాండ్ వినయ్ కూమార్, కలెక్టరేట్ ఎఓ అబ్దుల్ రహమాన్, ఆయా మండల తహసీల్దార్లు, సర్వేయర్లు, నీటిపారుదల శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.