Saturday, April 4, 2026

పెట్టుబడుల అమలు లో.. కలెక్టర్లు ప్రో యాక్టివ్ గా వుండాలి :సీఎం చంద్రబాబు

- Advertisement -

పెట్టుబడుల అమలు లో..
కలెక్టర్లు ప్రో యాక్టివ్ గా వుండాలి
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్సులో జిల్లాల వారీగా ర్యాంకులు
సీఎం చంద్రబాబు
అమరావతి

Collectors Must Be Proactive in Implementing Investments: CM Chandrababu
రెండో రోజు జిల్లా కలెక్టర్ల సదస్సులో రాష్ట్రంలో పెట్టుబడి ప్రతిపాదనలపై సీఎం చంద్రబాబు సమీక్ష జరిపారు. పెట్టుబడుల ప్రతిపాదనలపై జిల్లా కలెక్టర్లకు దిశా నిర్దేశం చేసారు.
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విషయంలో జిల్లా కలెక్టర్ల మధ్య పోటీ పెట్టాలని సీఎం సూచించారు. పెట్టుబడులు రాబట్టడం… వాటిని గ్రౌండ్ అయ్యేలా చూడడంలో కలెక్టర్లు ప్రోయాక్టీవ్ గా ఉండాలని సీఎం ఆదేశించారు.
జిల్లాల్లో ఉన్న అవకాశాలు,  అనుకూలతల ఆధారంగా పెట్టుబడులు సహా వివిధ రంగాలను ప్రొత్సహించేలా కలెక్టర్లు ప్రణాళికలు సిద్దం చేయాలని అన్నారు.
ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులను వేగంగా గ్రౌండ్ అయ్యేలా చర్యలు చేపట్టాలి. పెట్టుబడులను ఆకర్షించేలా జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలి. పెట్టుబడులు వస్తే… స్థానికంగా యువతకు ఉపాధి, ప్రజల తలసరి ఆదాయం పెరుగుతాయి. విశాఖ, అమరావతి, తిరుపతి ఎకనామిక్ రీజియన్ డెవలప్మెంట్ ప్రాంతాలుగా అభివృద్ధి చేస్తున్నాం. విశాఖ రీజిజయన్ కు పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్, మరావతికి పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి సురేశ్ , తిరుపతి రీజియన్ కు ముఖేష్ కుమార్ మీనా బాధ్యత వహిస్తారు. రీజియన్ల వారీగా పరిశ్రమలు, పెట్టుబడులు, ఆయా ప్రాంతాల ఆర్థికాభివృద్ధి బాధ్యతను ఈ అధికారులు తీసుకుంటారు. పెట్టుబడులపై ఎప్పటికప్పుడు కలెక్టర్లు సమీక్షించి ప్రాజెక్టులు గ్రౌండ్ అయ్యేందుకు తక్షణం చర్యలు చేపట్టాలని అన్నారు.
అనుమతులు వేగంగా ఇవ్వటంతో పాటు భూ కేటాయింపులు కూడా యుద్ధ ప్రాతిపదికన జరిగేలా చూడాలి. పరిశ్రమలకు నీటిని ఇస్తేనే వేగంగా ఉత్పాదన ప్రారంభిస్తారు. ఓర్వకల్లులో పారిశ్రామిక క్లస్టర్ రూపకల్పన చేశాం. ఇప్పుడు ఎయిర్ పోర్టు లాంటి మౌలిక సదుపాయాలు కూడా వచ్చాయి. ఇప్పుడు భవిష్యత్తులో ఓ మేజర్ పారిశ్రామిక హబ్ గా మారుతుంది. కడప జిల్లాలో కొప్పర్తి కూడా ఆ పారిశ్రామిక క్లస్టర్ గా తయారు కావాలి. జిల్లాల్లో పెట్టుబడులు మీటింగులు పెట్టాలి. పెట్టుబడులు రాబట్టేందుకు కలెక్టర్లు చొరవ తీసుకోవాలి. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్సులో జిల్లాల వారీగా ర్యాంకులిస్తాం. 2019-24లో రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. అమర్ రాజా కంపెనీ తిరుపతిలో కార్పోరేట్ ఆఫీస్ పెట్టింది… వారినీ గత పాలకులు పారిపోయేలా చేశారు. 2014-19లో పరిశ్రమలకు ఇచ్చిన భూములను గత ప్రభుత్వం వేరే అవసరాలకు వాడేసింది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఏపీని బెంగళూరుకు పోటీగా తీర్చిదిద్దాం. మోస్ట్ లివబుల్ సిటీగా హైదరాబాద్ ను తీర్చిదిద్దాం… ఎకో సిస్టం కల్పించాం. ఇప్పుడు ఆ ఫలితాలు హైదరాబాద్ అనుభవిస్తోంది.
ఇప్పుడు రాష్ట్రం మొత్తం అదే తరహా ఎకో సిస్టం ఏర్పాటు చేస్తున్నాం. ఏదైనా జిల్లాల్లో పరిశ్రమలు రాకుంటే ఆ జిల్లాల్లో టూరిజం ప్రమోట్ చేయాలి… లేదా ఐటీని ప్రమోట్ చేయాలి…  ఎస్ఎంఈలు ప్రమోట్ చేయాలి.. అగ్రికల్చర్ ప్రమోట్ చేయాలి. ఇలా ఏదోక రంగంలో ఆయా జిల్లాలకున్న ప్రత్యేకతలను దృష్టిలో పెట్టుకుని.. అనుకూలతలను దృష్టిలో పెట్టుకుని ఆయా రంగాల్లో అభివృద్ధి చేయాలి. ఆయా జిల్లాలకున్న అడ్వాంటేజీలను ప్రమోట్ చేయాలి.. పెట్టుబడులను ఆకర్షించాలి. అందరూ తమ దగ్గరకే రావాలని జిల్లా కలెక్టర్లు… మంత్రులు అనుకోకూడదని అయన అన్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్