- Advertisement -
కలెక్టర్లు పోటీ పడాలి
Collectors must compete
సమర్ధత పెంచుకోవాలి
సీఎం చంద్రబాబు నాయుడు
అమరావతి
కలెక్టర్ల కాన్ఫరెన్స్ రోజే గూగుల్ తో ఎంవోయూ చేసుకున్నాం. టెక్నాలజీని అందిపుచ్చుకుని ముందుకు వెళ్ళాలి. మొదటి కాన్ఫరెన్స్ లో చీకటిలో ఉన్నాం..ఇప్పుడు కొద్దిగా వెలుతురులోకి వచ్చామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కలెక్టర్ల సమావేశంలో అయన మాట్లాడుతూ కలెక్టర్లకి జీతాలు మొదటి తేదీన అందుకోలేదు.. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 1వ తేదీన జీతాలు ఇస్తున్నాం. మీరు సమర్థత పెంచుకోవాలి.. తప్పులు చేసిన వారిని శిక్షించాలని అన్నారు.
విశ్వసనీయత ఉండడం వల్ల వెళ్లిపోయిన కంపెనీలు వెనక్కి వస్తున్నాయి. స్పీడ్ ఆఫ్ బిజినెస్ తో ముందుకు వెళ్తున్నాం. కలెక్టర్స్ పోటీ పడాలి..సమీక్ష కోసం మీటింగ్ పెట్టుకున్నాం. 4 సార్లు ముఖ్యమంత్రి.. మొదటిసారి.. ఎప్పుడు చూడని ఇబ్బంది చూస్తున్నాను. 10లక్షల కోట్లు అప్పు వుంది. – సూపర్ సిక్స్ అమలు చేయాలి.. గవర్నమెంట్ నడపాలి.. ఎఫ్ఐబి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. 60% కంప్లైంట్ లు ల్యాండ్ గ్రాబీయింగ్ మీదనే ఉన్నాయి. ఫ్రీగా ఇస్తామన్నా.. అమలు చేయాలంటే సవాళ్లుగా ఉంది.. ఇసుక మాఫియా ఉంది. గంజాయి, డ్రగ్స్ విపరీతంగా పెరిగింది. ఎర్రచందనం స్మగ్లర్స్ తయారయ్యారు. బియ్యం అక్రమ రవాణాపై రూట్ లెవల్ కి వెళ్ళాలి. పోర్ట్ లు, సెజ్ లు కబ్జా చేస్తున్నారు.. దీనికి కరెక్ట్ చేస్తాం. 7 శ్వేత పత్రాలు విడుదల చేశాం. 15వేల కోట్లు కేంద్రం ఇచ్చింది.. 16వేల కోట్లు బయట తీసుకున్నాం.. అమరావతికి 31వేల కోట్లు. పోలవరం 2027 కి పూర్తి చేస్తాం.. కేంద్రం 1200 కోట్లు విడుదల చేసింది. నరేగా పనులు సంక్రాంతి నుండి ప్రారంభం కావాలి. 16347 టీచర్స్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చాం. 43 వేల స్కూల్స్ లో టీచర్స్, పేరెంట్స్ మీటింగ్ జరిగింది..రెగ్యులర్ గా నిర్వహించాలి. తూతూ మంత్రంగా రెవెన్యూ సదస్సులు పెడితే కుదరదు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక పై 4 డిపార్ట్మెంట్ లోనే ఫిర్యాదులు ఉన్నాయి. మనం పెత్తందార్లం కాదు.. ప్రజా సేవకులం. – తూతూ మంత్రంగా సమస్యల పరిష్కరం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేసారు. ఆర్థిక పరిస్థితులను బట్టి అర్హులకు సంక్షేమ పథకాలు ఇస్తాం. ధాన్యం కొనుగోళ్లు బాగా జరుగుతున్నాయని అయన అన్నారు.
- Advertisement -