ఎన్.ఆర్.ఈ.జి.ఎస్, పనులపై కలెక్టర్ సమీక్ష
Collector's review of NREGS, works
సిద్దిపేట
జిల్లాలో ఎన్.ఆర్.ఈ.జి.ఎస్, 15వ ఆర్థిక సంఘం ద్వారా వివిధ అభివృద్ధి
పనుల కొరకు మంజూరై చేపట్టిన పనులపై
జిల్లా కలెక్టర్ ఎం. మనుచౌదరి కలెక్టర్ కార్యాలయములో సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎన్.ఆర్.ఈ.జి.ఎస్ ద్వారా గ్రామపంచాయతీ, అంగన్ వాడి, సిసి రోడ్డు తదితర పనులు చేపట్టడం జరిగిందని, అందులో ఇప్పటి వరకు అనుమతులు పొందిన అంగన్ వాడి భవన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. నిర్మాణ పనులకు భూ సమస్యలు ఉన్న వాటి వివరాలు అందించాలని, ఇంకా ప్రారంబించాల్సిన పనుల వివరాలు అంధించాలని తెలిపారు. పనులకు అదనంగా నిధులు అవసరమైతే వాటి వివరాలను తెలియజేయాలన్నారు. అదే విధంగా 15వ ఆర్థిక సంఘం ద్వారా చేపడుతున్న సబ్ సెంటర్ ల నిర్మాణాలను పూర్తి చేయాలని, పనుల పురోగతిని ప్రతివారం సమీక్షిస్తానని, అదే విధంగా అధికారులు కూడా క్షేత్రస్థాయిలో పనుల పురోగతిని పర్యవేక్షించడం తో పాటు సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు. ఇప్పటికే కొన్ని నిర్మాణ పనులు ప్రారంభించగ వాటిని ఈ ఆర్థిక సంవత్సరం చివరిలోగా పూర్తి చేయాలని అదే విధంగా టెండర్ దశలో ఉన్న వాటిని త్వరగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి శారద, జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి పల్వన్ కుమార్, పంచాయతీరాజ్ ఈఈ శ్రీనివాస్, ఆయా శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.