Saturday, February 15, 2025

కలెక్టర్లు ఎనుమరెటర్ లతో విస్తృతంగా మాట్లాడాలి

- Advertisement -

కలెక్టర్లు ఎనుమరెటర్ లతో విస్తృతంగా మాట్లాడాలి

Collectors should talk extensively with enumerators

మంత్రులు, ఎమ్మెల్యేల కు సమాచారం ఇవ్వండి

దేశం మొత్తం తెలంగాణను గమనిస్తుంది

సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే వీడియో కాన్ఫరెన్స్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

హౌస్ లిస్టింగ్ పూర్తిచేసుకుని నేటి నుంచి ఇంటింటి సర్వే ప్రారంభమవుతున్న నేపథ్యంలో కలెక్టర్లు ఏనుమరెటర్లతో విస్తృతంగా మాట్లాడాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శనివారం సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే పై ఉన్నతాధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. నేటి నుంచి ఇంటింటి సర్వే ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రజల నుంచి అనేక సందేహాలు వ్యక్తమవుతుంటాయి, కలెక్టర్లు ఎనుమరెటర్ ల తో ఎప్పటికప్పుడు మాట్లాడితే ప్రజల సందేహాలు ఏంటో వెను వెంటనే తెలుసుకునే అవకాశం కలుగుతుందని తెలిపారు. ప్రజల సందేహాలను కలెక్టర్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చి ప్రజల అనుమానాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేయాలని ఆదేశించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కువ సార్లు సర్వేలో భాగస్వాములు అయ్యేలా చూడాలని అధికారులను కోరారు. సమగ్ర కుటుంబ సర్వే చాలా పెద్ద కార్యక్రమం, ఇలాంటి కార్యక్రమాన్ని ఇప్పటివరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుకు తీసుకెళుతున్న అధికారులను డిప్యూటీ సీఎం అభినందించారు. క్వశ్చనీర్ పకడ్బందీగా రూపొందించారు, ఎనిమరేటర్లకు బాగా శిక్షణ ఇచ్చారు, హౌస్ లిస్ట్ కూడా విజయవంతంగా పూర్తి చేశారు. ఇదే రీతిలో కుటుంబ సర్వేను విజయవంతంగా నిర్వహించాలని కోరారు. ఈ దేశంలో జరిగే అతిపెద్ద కార్యక్రమం ఇది.. మనం చూపే నిబద్ధతపైనే ఈ సర్వే విజయవంతం అవడం ఆధారపడి ఉంటుంది అన్నారు. యావత్ దేశం మొత్తం తెలంగాణ రాష్ట్రం చేపడుతున్న కుటుంబ సర్వేను గమనిస్తుందని వివరించారు. ఈ దేశంలో ప్రగతిశీల భావాలను, కార్యక్రమాలను వ్యాప్తి చేయడానికి ఈ సర్వే గొప్పగా ఉపయోగపడుతుందని తెలిపారు.  జిల్లా కలెక్టర్లు ప్రతి చిన్న విషయం కూడా నిర్లక్ష్యం చేయకుండా ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి, ఇతర ఉన్న అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించుకోవాలని తెలిపారు. సర్వేపై కలెక్టర్లతో పాటు అన్ని స్థాయిలోని అధికారులు విస్తృత ప్రచారం నిర్వహించాలని ఆదేశించారు. ప్రధానంగా పట్టణాలపై దృష్టి పెట్టాలని కోరారు. కార్యక్రమంలో చీఫ్ సెక్రటరీ శాంత కుమారి, ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి  సందీప్ కుమార్ సుల్తాన్య యితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్