ఖమ్మం: ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకంగా బిఆర్ఎస్ పార్టీ మీటింగ్ కోసం ఎస్సార్ అండ్ బీజీఎన్నార్ ప్రభుత్వ కాలేజీ ఆస్తులను బిఆర్ఎస్ పార్టీ నాయకులు ధ్వంసం చేశారని పి.డి.ఏస్.యు నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎలక్షన్ కోడ్ నిబంధనలకు వ్యతిరేకంగా ఎస్.ఆర్.అండ్.బిజీ.యన్ అర్ కాలేజీ స్టేజిని కాలేజీ ఆస్తులను కాలేజీ ప్రిన్సిపల్ జాకీరుల్లాఅక్కడ వుండగానే బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు ధ్వంసం చేశారని పి.డి.ఎస్.యూ ఖమ్మం జిల్లా కార్యదర్శి వెంకటేష్ అన్నారు.
ఈ నెల ఐదో తేదీన బిఆర్ఎస్ పార్టీ మీటింగ్ కి తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ వస్తున్నారని ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ నాయకులు మీటింగ్ పేరుతో ప్రభుత్వ కాలేజీ ఆస్తులను రాత్రి సమయంలో ధ్వంసం చేసి మరి మీటింగ్ నిర్వహించుకుంటున్నారని దీనికి ఎస్సార్ అండ్ బిజీఎన్ఆర్ కాలేజీ ప్రిన్సిపాల్ మరియు సిబ్బంది దగ్గరుండి మీటింగ్ పనులను ఎలక్షన్ నిబ్బందనలకు వ్యతిరేకంగా పని చేపిస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.
ప్రభుత్వ కాలేజీ ఆస్తులను బిఆర్ఎస్ పార్టీ మీటింగ్ కోసం ధ్వంసం చేస్తున్నారనే విషయంపై పి. డి. ఎస్. యూ విద్యార్థి సంఘం గా వెంకటేష్ కాలేజీ ప్రిన్సిపాల్ జాకిరిల్లా కి ఫోన్ చేసి అడగగా ధ్వంసం చేస్తే చేశారు లే అని ఒక బి.ఆర్.ఎస్ పార్టీ సభ్యులుగా మాట్లాడుతున్నారనీ ఒక కాలేజీ ప్రిన్సిపాల్ గా మాట్లాడా లేదని వారి పై మండిపడ్డా విద్యార్థి సంఘాలు.
సుమారు 6000 వేల మంది విద్యార్థులు చదువుతుంటే నెక్స్ట్ యూనివర్సిటీ కావలసినటువంటి కాలేజీ ఆస్తులను మీటింగ్ ల పేరుతో ఎలక్షన్ కమిటీ పరిమిషన్ లేకుండా కాలేజీ ఆస్తులను ధ్వంసం చేస్తున్న కూడా కళాశాల ప్రిన్సిపాల్ గా ఇలా మాట్లాడటం ఏంటని తక్షణమే ఎన్నికల కమిషన్ మరియు జిల్లా కలెక్టర్ స్పందించి ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన వారిపై మరియు వారికీ సహకరించిన కాలేజీ ప్రిన్సిపల్ జాకీర్ లల్లా పై చర్యలు తీసుకోవాలని లేదంటే పి.డి.ఎస్.యూ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామన్నారు.
కెసిఆర్ సభ కోసం కాలేజీ స్టేజి ధ్వంసం
- Advertisement -
- Advertisement -