కళాశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
College surroundings should be kept clean-మంథని డివిజనల్ పంచాయతీ అధికారి సతీష్ కుమార్
మంథని
కళాశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మంథని డివిజనల్ పంచాయతీ అధికారి కె సతీష్ కుమార్ ప్రిన్సిపాల్ శ్రీలత ను ఆదేశించారు.
శనివారం మంథని పట్టణంలోని తెలంగాణ గిరిజన సంక్షేమ రెసిడెనిషియల్ బాలికల జూనియర్ కళాశాలను మంథని డివిజనల్ పంచాయతీ అధికారి/ కళాశాల ప్రత్యేక అధికారి కె సతీష్ కుమార్ అకస్మికంగా సందర్శించారు. విద్యార్థులకు అందజేయబడుతున్న బోజన తీరును పరిశీలించారు. విద్యార్థులకు పోషాకాలతో కూడిన నాణ్యమైన అహారపదార్థములను అందజేయాలని కళాశాల ప్రిన్సిపాల్ ని కోరారు. స్టోర్ గదిలో నిల్వ ఉన్న బియ్యము, ఆహార నిల్వలను పరిశీలించి ఎప్పటికప్పుడు పురుగు నివారణకు వేపాకును ఉపయోగించ వలసిందిగా కోరారు.విద్యార్థులకు అందించే బోజన అహారపదార్థములను వంట చేయుటకు ముందే నిరంతరం పరిశీలించాలని సూచించారు. మరుగు దొడ్లు, మూత్ర శాలలను పరిశీలించి నిరంతరం శుబ్రం చేయించాలని ఆదేశించారు. స్వీయ శుభ్రత మరియు చేతులు కడుక్కోవడం ఫై అవగాహనను విద్యార్థులకు కల్పించారు. కళాశాల పరిసరాలలో విద్యార్థుల గదులలో విద్యుత్ లైట్లు సక్రమముగా పని చేసె విధంగా పర్యవేక్షించాలని కళాశాల ప్రిన్సిపాల్ శ్రీలత కు సూచించారు.




