Friday, October 18, 2024

జనసేనతో పాటు కేఏపాల్ ను కలుపుకోండి

- Advertisement -

రేవంత్ ఉచిత సలహా

హైదరాబాద్, అక్టోబరు 26, (వాయిస్ టుడే):  బీజేపీ.. జనసేనతో పాటూ కేఏపాల్ ను కూడా కలుపుకుంటే బాగుండని టీపీసీసీ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ లోని ఎఐసిసి కార్యాలయం లో టి కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి, ఉత్తంకుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ల మాట్లాడారు. ఈనేపథ్యంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. నిన్న ఎన్నికల కమిషన్ ను కలిశామన్నారు. నోటిఫికేషన్ లోపల నగదు బదిలీలు పూర్తి చెయ్యాలని కోరామన్నారు. రిటైర్డ్ అధికారులను.. కొనసాగిస్తూ అధికార దుర్వినియోగాన్ని కి ప్లాపడుతున్నారు వెంటనే తొలగించాలని అన్నారు. ప్రయివేట్ అర్మిలా కేసీఆర్ ఉపయోగించుకుంటున్నారని తెలిపారు. నిజాం దగ్గర రజాకార్ల లాగా.. కేసీఆర్ వద్ద ఈ అధికారులు రజాకార్ల లా పనిచేస్తున్నారని అన్నారు. అధికారులు బీఆర్ఎస్ ఎన్నికల నిర్వహణ చేస్తున్నారని మండిపడ్డారు. అంజనీ కుమార్, స్టీఫెన్ రవీంద్ర లను బదిలీ చెయ్యాలని కోరామని సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమేష్ కుమార్, స్మితా సబర్వాల్, జయేష్ రంజన్ లు బీఆర్ఎస్ కోసం పనిచేస్తున్నారని మండిపడ్డారు. రైతు బంధు, దళిత బంధు, బిసి బంధు, కళ్యాణ లక్ష్మి, శాది ముభారక్ నిధులు నవంబర్ 2 లోపు విడుదల చెయ్యాలని కోరారు. లబ్ధిదారులకు ఏ నిధులు పెండింగ్ లో పెట్టినా.. మా ప్రభుత్వం వచ్చాక మా హామీ మేరకు డబుల్ నిధులు వస్తాయన్నారు.కేసీఆర్ ఏం చెప్పినా అమలు చెయ్యరన్నారు. కాంగ్రెస్ పై విష ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడిగడ్డ ప్రాజెక్ట్ ఎందుకు భూమిలోకి కుంగింది? అని ప్రశ్నించారు. ఆ ప్రాజెక్ట్ వద్ద బొగ్గు నిక్షేపాలు ఉంటాయన్నారు. ప్రాజెక్ట్ నిర్మాణ నాణ్యత లోపం అన్నారు. సాయిల్ టెస్ట్ వంటి జాగ్రత్తలు పడలేదున్నారు. గాల్లో మేడలా మెడిగడ్డ ప్రాజెక్ట్ ను నిర్మించారని ఆరోపించారు. మావోయిస్టుల మీద, సంఘ విద్రోహ శక్తులు చేశారని ప్రచారం మొదలు పెట్టారని మండిపడ్డారు. కేసీఆర్ జైలు కు వెళ్ళే పరిస్థితి వచ్చిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. డ్యాం సేఫ్టీ అధికారులు ఏం చేస్తున్నారు? అని ప్రశ్నించారు. నివేదిక బయట పెట్టాలన్నారు. బీఆర్ఎస్ ను కాపాడేందుకు ప్రయత్నం చేస్తున్నారని  మురళిధర రావు ఎప్పుడో రిటైర్ అయ్యారని గుర్తు చేశారు. ఆయన ఇపుడు కేసీఆర్ కోసం పనిచేస్తున్నారని తెలిపారు. ఇసుక కొట్టుకు పోతే డ్యాం కుంగింధి అంటే, ఎంత నాణ్యత లోపం ఉందో స్పష్టంగా తెలుస్తుందన్నారు. కేసీఆర్ అక్రమ సంపాదనలో కేంద్రానికి కప్పం కడుతున్నారని అన్నారు. అందుకే కేంద్రం కేసీఆర్ ను కాపాడుతోందన్నారు. ఎన్నికల అధికారులకు పిర్యాదు చేయడం ప్రాసెస్ అన్నారు.అధికారులు తీసుకునే చర్యలను బట్టి మా తదుపరి కార్యాచరణ ఉంటుందన్నారు. కేసీఆర్, హరీష్, కెటిఆర్ లు ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పరని తెలిపారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఉంది . అందుకే అక్కడ ఎటువంటి దాడులు ఉండవన్నారు. ఎన్నికలు ఉండే రాష్ట్రాలకు ఈడి, సిబిఐ లు ముందు వెళ్తాయన్నారు. కాంగ్రెస్ ను వీడిన నాయకులు బీజేపీ సిద్దాంతాలు నమ్మి పోలేదన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ.. కేసీఆర్ పై చర్యలు తీసుకుంటుంది అని నమ్మారన్నారు. అది అక్కడ సాధ్యం కాదని నమ్మి వెనక్కి వస్తున్నారని తెలిపారు. రాజ్ గోపాల్ రెడ్డి, డి.కె అరుణ, విజయశాంతి, విశ్వేశ్వర్ రెడ్డిలు సిద్దాంతాలు నమ్మి బిజెపిలో చేరలేదని స్పష్టం చేశారు. బీజేపీ.. జనసేనతో పాటూ కే.ఏ.పాల్ ను కూడా కలుపుకుంటే బాగుండని వ్యంగాస్త్రం వేశారు. కొడంగల్ లో పోటీ చేద్దామని కేసీఅర్ ను కొర్తున్నానని అన్నారు. పార్టీ ఆదేశిస్తే రేవంత్, భట్టి ఎక్కడయినా పోటీ చేస్తాం, కేసీఆర్, కెటిఆర్ లను చిత్తు చిత్తుగా ఒడిస్తామన్నారు.

మేం వస్తే డబ్బులు ఇస్తాం

కేసీఆర్ చెల్లింపులు వాయిదా వేస్తే  కాంగ్రెస్ రాగానే చెల్లిస్తుందన్న రేవంత్‌.ఒకవేళ కేసీఆర్ చెల్లింపులు వాయిదా వేస్తే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే చెల్లిస్తుందని రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు.  కాంగ్రెస్ ను బూచిగా చూపి కేసీఆర్ చెల్లింపులు ఆపాలని చూస్తున్నారని.. కాంగ్రెస్ పై తప్పుడు ప్రచారం చేసినా….బీఆరెస్ ను ఓటమి నుంచి ఎవరూ కాపాడలేరరని స్పష్టం చేశారు.  మళ్లీ కేసీఆర్ మాయలో పడేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరన్నారు.  నాణ్యతాలోపం వల్లే మేడిగడ్డ ప్రాజెక్టు పిల్లర్లు కుంగిపోయాయయని..  కుట్ర కోణాన్ని తెరపైకి తెచ్చి ప్రభుత్వం తప్పించుకోవాలని చూస్తోందని ఆరోపించారు.  క్రిమినల్ కేసులు పెట్టి విచారిస్తే తప్ప అసలు విషయం బయటకు రాదన్నారు. డ్యామ్ సేఫ్టీ అధికారులు నివేదికను నివేదికను ఎందుకు  బయటపెట్టడం లేదని ప్రశ్నించారు.  కేంద్రానికి.. బీఆర్ఎస్ కు ఉన్న లాలూచీ ఏంటో చెప్పాలన్నారు.  కేంద్రానికి ప్రొటెక్షన్ మనీ చెల్లించారు కాబట్టే రాష్ట్ర ప్రభుత్వ తప్పిదాలపై చర్యలు తీసుకోవడంలేదన్నారు.  మేడిగడ్డ కాదు.. కేసీఆర్ ప్రభుత్వం కుంగిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. హరీష్,  కేటీఆర్ బిల్లా రంగా లాంటివారు.. కేసీఆర్ చార్లెస్ శోభారాజ్ లాంటి వారని।.   వాళ్ళేం చేశారో చెప్పకుండా కాంగ్రెస్ పై ఎదురు దాడికి దిగుతున్నారని మండిపడ్డారు.  ఈడీ,  ఐటీ, సీబీఐ బీజేపీకి ఫ్రంటల్ ఆర్గనైజేషన్లు అన్నారు. బంధు, దళిత  బంధు పథకాలను ఆపాలని రేవంత్ రెడ్డి ఈసీకి పిర్యాదు చేశారని..  కాంగ్రెస్ పార్టీ రైతుద్రోహి, దళిత ద్రోహి బీఆర్ఎస్ నేతలు వరుసగా విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఈ సాకుతో చెల్లింపులు ఆపేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని.. రెండో తేదీ లోపు సంక్షేమ పథకాల లబ్దిదారులందరికీ చెల్లింపులు చేయాలనేది తమ విధానమని రేవంత్ చెబుతున్నారు. ఈ అంశపై రాజకీయ దుమారం రేగే అవకాశం ఉంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సంక్షేమ పథకాల పేరుతో ఓటర్ల ఖాతాల్లోకి నగదు బదిలీ చేయవద్దని కాంగ్రెస్ అంటోంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్