పాలమూరు సభకు రండి
సీఎం రేవంత్ కు ఆహ్వానం
హైదరాబాద్
కాంగ్రెస్ పార్టీ మహబూబ్ నగర్ నుంచి పార్లమెంటు ఎన్నికల ప్రచారం ప్రారంభించినుందని సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు ప్రజాదీవెన సభతో ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. పాలమూరు ప్రజాదీవెన సభ కోసం సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు వంశీచంద్ రెడ్డి, ప్రజాప్రతినిధులు సీఎంను ఆహ్వానించారు. మార్చ్ 6 సాయంత్రం 4 గంటలకు మహబూబ్ నగర్ పట్టణంలోని ఎంవిఎస్ కళాశాల మైదానంలో సభ “పాలమూరు ప్రజా దీవెన సభ” జరగనుంది. కొడంగల్ నారాయణ పేట ఎత్తిపోతల ప్రకటనతో పాలమూరులో ఇప్పటికే కాంగ్రెస్ కు అనుకూల పవనాలు వీస్తున్నాయి. ప్రజాదీవెన సభలో ముఖ్యమంత్రి మహబూబ్ నగర్ కు మరిన్ని వరాలు ప్రకటిస్తారనే సమాచారం. సీఎంకు ఆహ్వానం అందించిన వారిలో ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, వాకిటి శ్రీహరి ముదిరాజ్, జి. మధుసూదన్ రెడ్డి, వేర్లపల్లి శంకర్, అనిరుద్ రెడ్డి, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్ తదితరులున్నారు.
పాలమూరు సభకు రండి

- Advertisement -
- Advertisement -