అసెంబ్లీకి రండి
సవాల్ స్వీకరిస్తాం
న్యూఢిల్లీ, జూలై 17, (వాయిస్ టుడే)
Come to the Assembly
We will accept the challenge
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వానికి సూచనలు చేస్తే స్వీకరించడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేసీఆర్ కుటుంబం కడుపునిండా విషం పెట్టుకొని మాట్లాడుతోందని ఆరోపించారు. కేసీఆర్ మొదట అసెంబ్లీకి రావాలని సూచించారు.తుమ్మిడిహట్టి ప్రాజెక్టు కోసం మహారాష్ట్రలో పర్యటిస్తానని ముఖ్యమంత్రి వెల్లడించారు. రెండున్నరేళ్లలో లక్ష ఉద్యోగాలు ఇచ్చి తీరుతామని అన్నారు. బతుకమ్మ చీరలు, కేటీఆర్ కిట్ మినహా పాత పథకాలన్నీ అమల్లోనే ఉన్నాయని స్పష్టం చేశారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖలు రాయడం ఆపేసి, ఒక ప్రణాళికతో ముందుకు రావాలని సూచించారు. తెలంగాణ అభివృద్ధికి కిషన్ రెడ్డితో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు.
పోలీసులకు కేటీఆర్ వార్నింగ్
బీఆర్ఎస్ సోషల్ మీడియా యాక్టివిస్ట్ శశిధర్ గౌడ్ అలియాస్ నల్లబాలు విషయంలో పోలీసుల తీరుపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో ఎవరూ శాశ్వతంగా ఉండరని, తమకు కూడా ఒక రోజు వస్తుందని, అప్పుడు ప్రతి చర్యను సమీక్షిస్తామని డీజీపీని ఉద్దేశించి హెచ్చరించారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, భయానక పరిస్థితులను ప్రజలు గమనిస్తూనే ఉన్నారని తెలిపారు. తమకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందని… తమ హక్కులను కాపాడుకునేందుకు తాము పోరాటం చేస్తూనే ఉంటామని చెప్పారు.


