- Advertisement -
ఫీజు బకాయిలు చెల్లించాలని10న జిల్లా కలెక్టరేట్ల ముట్టడికి తరలి రండి
Come to the District Collectorates siege on 10th to pay the duesబిసి విద్యార్ధి సంఘం రంగారెడ్డి జిల్లా అద్యక్షులు వాల్ దాస్ చంద్రశేఖర్ గౌడ్ పిలుపు
హైదరాబాద్, డిసెంబర్ 8
రాష్ట్రము లో 16లక్షల 75వేల మంది విద్యార్థుల స్కాలర్ షిప్ లు, ఫీజుల బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 10వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముట్టడికి విద్యార్థులు పెద్ద ఎత్తున తరలి రావాలని బిసి విద్యార్ధి సంఘం రంగారెడ్డి జిల్లా అద్యక్షులు వాల్ దాస్ చంద్రశేఖర్ గౌడ్ పిలుపు నిచ్చారు పీజు రియంబర్స్ మెంట్, స్కాలర్ షిప్స్ బకాయిలు రాకపోవడంతో కళాశాలల ఫీజులు కట్టడానికి, ఉన్నత చదువులు చదువుకోవడానికి విద్యార్థులు తమ రక్తాన్ని, కిడ్నీలను అమ్ముకునే పరిస్థితి ఏర్పడిందని చంద్రశేఖర్ గౌడ్ ఆందోళ న వ్యక్తం చేశారు.కమీషన్ల కోసం కంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తున్నారే తప్ప విద్యార్థు లు ఆకలి చావులకు బలవుతున్నా ఏమాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రభుత్వం స్పందించకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి ఉద్యమా న్ని మరింత బలోపేతం చేస్తామని వారు హెచ్చరించారు. మూసీ సుందరీకరణ పేరు తో రూ. లక్షన్నర కోట్ల బడ్జెట్ ను ఖర్చుచేస్తోం దని, బావిభారత పౌరులైన విద్యార్థుల భవిష్యత్ ను సుందరీకరణ చేయాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేకపోవడం శోచనీయమన్నారు.
- Advertisement -




