Friday, February 20, 2026

రాజధాని నగరంలో  రాబోతున్న….అండర్ గ్రౌండ్ మెట్రో…

- Advertisement -

 అండర్ గ్రౌండ్ మెట్రో…

Coming up in the capital city….underground metro…

హైదరాబాద్, ఆగస్టు 14
మెట్రో సర్వీసులు ప్రస్తుతం దేశంలోని పలు నగరాల్లో అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్‌లో మెట్రో జనాదరణ పొందింది. ఇప్పటి వరకు రాజధాని నగరంలో మెట్రో తొలి దశలో నిర్మించినవన్నీ ఆకాశ మార్గాలే. ఎయిర్‌పోర్టు కారిడార్‌ లో ఆకాశమార్గంతో పాటు మొదటిసారిగా భూమి పై కొంచెం, భూగర్భంలో మరికొంచెం దూరం నిర్మించేలా సమగ్ర ప్రాజెక్ట్‌ నివేదిక లో పొందుపరిచారు. ఈ నేపథ్యంలోనే నూతన మెట్రో మార్గాలు కూడా నగర వాసులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎలివేటెడ్ మార్గాలు ప్రయాణికులకు అందుబాటులో ఉండగా ఇప్పుడు మాత్రం భూగర్భం మెట్రో మార్గాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు.ప్రస్తుతం నాగోల్ నుంచి రాయదుర్గం వరకు మెట్రో అందుబాటులో ఉంది. అయితే రెండో దశలో దీనిని ఎల్బీనగర్, చాంద్రాయణ గుట్ట, మైలార్‌దేవ్ పల్లి, జల్‌పల్లి, పీ7 రోడ్ , శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు 33.1 కిలో మీటర్ల మేర పొడగించనున్నారు. ఈ ప్రతిపాదిక మార్గంలో నాగోల్ నుంచి లక్ష్మీగూడ వరకు 21.4 ఎలివేటెడ్ మార్గం ఉంది. అక్కడ నుంచి పీ 7 రోడ్డు ఎయిర్ పోర్టు ప్రాంగణ సరిహద్దు వరకు 5.28 కిలో మీటర్ల మేర భూమార్గం ఉంది. అయితే అక్కడి నుంచి టెర్మినల్ వరకు 6.42 కిలో మీటర్ల మార్గంలో అండర్ గ్రౌండ్  మార్గం నిర్మించనున్నారు.నగరంలో ఇదే తొలి అండర్ గ్రౌండ్ మార్గం అవుతుంది. అలాగే  ఇక్కడ కార్గో, టెర్మినల్, ఏకోసిటీ స్టేషన్లు కూడా నిర్మించడంతో పాటు డిపోను కూడా ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన కూడా ఉంది. ఈ సారి రెండవ దశ మెట్రోలో 1.5 కిలో మీటరుకు ఒక స్టేషన్ ఉండేలా మొత్తం 22 స్టేషన్లు నిర్మించనున్నారు. వీటిలో కొన్నింటిని భవిష్యత్తు అవసరాల కోసం ఫ్యూచర్ స్టేషన్లుగానూ ఉంచనున్నారు. అలాగే నాగోల్ ఎల్బీనగర్, చాంద్రాయణ గుట్ట, మైలార్‌దేవ్ పల్లి వద్ద ఇంటర్ చేంజ్‌స్టేషన్లు కూడా ఉంటాయి. ఇందుకు సంబంధించి ఇప్పటికే డీపీఆర్ కూడా పూర్తయింది.రాయదుర్గం  నుంచి నాగోల్‌  వరకు ప్రస్తుతం ఉన్న మెట్రో రైలు మార్గాన్ని ఇక నుంచి ఎల్బీనగర్, చాంద్రాయణగుట్ట, మైలార్‌దేవ్‌పల్లి, జల్‌పల్లి, పీ7 రోడ్, శంషాబాద్‌ విమానాశ్రయం వరకు 33.1 కి.మీ. వరకు విస్తరించేలా రెండో దశలో ప్రతిపాదించారు.ఇక్కడ రహదారిపై డివైడర్‌ స్థలం చాలా విశాలంగా ఉంటుంది. నిర్మాణ వ్యయం తగ్గేందుకు భూమార్గంలో మెట్రో నిర్మించేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గతంలో సూచించారు. బేసిక్ స్టడీ చేశాక స్వల్పదూరం భూమార్గంలో తీసుకెళ్లేలా డీపీఆర్‌లో ప్రతిపాదించారు.విమానాశ్రయ కాంపౌడ్‌ సరిహద్దు నుంచి టెర్మినల్‌ వరకు 6.42 కి.మీ. అండర్ గ్రౌండ్లో మెట్రో నిర్మించనున్నారు. ఇది నగరంలో మొదటి భూగర్భ మార్గం కానుంది. ఇక్కడ మూడు స్టేషన్లు – కార్గో, టెర్మినల్, ఏరోసిటీ రాబోతున్నట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా ఇక్కడ డిపో నిర్మించాలని ప్రతిపాదించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్