ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ ఆఫీసర్లను సన్మానించిన పోలీస్ కమిషనర్
Commissioner of Police felicitated retired police officers
ఖమ్మం :
ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పూలమాలలు, శాలువలతో ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు. పోలీస్ కమిషనర్ కార్యాలయంలో జరిగిన సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ .. సుదీర్ఘ కాలంగా వివిధ విభాగాలలో భాద్యతయుతమైన విధులు నిర్వహించి పోలీస్ శాఖ కు ఎనలేని సేవలతో పోలీస్ శాఖ మన్ననలు పొందారని పోలీస్ కమిషనర్ కొనియాడారు. రిటైర్ మెంట్ తన వృత్తికే, కాని తన వ్యక్తిత్వానికి కాదని, మీ విధినిర్వహణలో తోడ్పాటు అందించిన కుటుంబ సభ్యులను ఈ సందర్భంగా అభినందించారు. పదవి విరమణ చేసిన మీరు ఇకపై కుటుంబ సభ్యులతో అనందంగా వారి భావి జీవితం ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో గడపాలని ఆకాంక్షించారు. ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులలొ .నాగేశ్వరరావు పి. క్రిష్ణయ్య, ఏఆర్‌ఎస్ జి సూర్యారావు, ఏఆర్‌ఎస్‌ఐ లు వున్నారు
ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ నరేష్ కుమార్, ఆర్ ఐ కామరాజు, పోలీస్ అసోసియేషన్ జానీమియా, పంతులు పాల్గొన్నారు.