హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి వున్నామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేసారు. శనివారం అయన మీడియాతో మాట్లాడారు. రెండు దశాబ్దాలుగా మాదిగ సామాజికవర్గానికి అన్యాయం జరుగుతుంది. ఎస్సీ వర్గీకరణను వేగవంతం చేయటం కోసం కేంద్ర కమిటీ ని వేసాం. ఇంట్లో కూర్చుని ప్రభుత్వాన్ని నడిపేవారికి పరిపాలన ఏం తెలుసు ?
ఫాంహౌస్ లో కాదు .. ముఖ్యమంత్రి సచివాలయంలో ఉండాలి. బీజేపీ అధికారంలోకి రాగానే విచారణ జరిపి అవినీతి పరులను జైలుకు పంపుతాం. బీజేపీ అధికారంలోకి వచ్చాక.. ప్రస్తుత పథకాలను కొనసాగిస్తాం. ఎంఐఎం వలనే కేసీఆర్ ప్రభుత్వం, తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించటం లేదు. కేంద్ర నిధులపై తెలంగాణ సీఎం కేసీఆర్ అవాస్తవాలు మాట్లాడుతున్నారు. దక్షిణాదిలో అన్ని రాష్ట్రాలపై బీజేపీ ఫోకస్ చేసిందని అయన అన్నారు.



