- Advertisement -
రైతు భరోసా విధివిధానాలపై కమిటీ
Committee on Raithu Bharosa Procedures
విప్ ఆది శ్రీనివాస్
హైదరాబాద్
సమైక్య ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయం జరిగిందని ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నాం. కేటీఆర్ పై వ్యక్తిగతంగా ఎలాంటి ఉద్దేశం లేదు రైతు భరోసా పై వారు ఇచ్చే సూచనలు సలహాలు స్వీకరిస్తామని విప్ వేములవాడ శాసనసభ్యుడు ఆది శ్రీనివాస్ అన్నారు. శనివారం అయన సభలో మాట్లాడారు. రైతు భరోసా పై విధివిధానాలు ఖరారుకు ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నేతృత్వంలో కమిటీ వేయడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో చెప్పినట్లు సభలో రైతు భరోసా పై చర్చ జరిగిన తర్వాత వాటిని అవలంబిస్తాం. గతంలో లాగా వాగులు వంకలు, కొండలు, గుట్టలకు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు ఇవ్వకుండా నిజమైన రైతులకు అందజేస్తామని అన్నారు.
- Advertisement -