ఆహార నాన్యాతపై కమిటీలు
Committees on Food Quality
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ.
జయశంకర్ భూపాలపల్లి,
సంక్షేమ వసతి గృహాలు, విద్యాసంస్థలు, ప్రభుత్వ పాఠశాలల్లో ఆహార భద్రతా, నాణ్యతా ప్రమాణాలు తనిఖీ కోసం జిల్లా, మండల స్థాయి కమిటీలను ఏర్పాటు చేస్తూ జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి, గిరిజన, బీసీ, మైనారిటీ సంక్షేమ, మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, పాఠశాల విద్య నియంత్రణలో వివిధ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలలు, ఆసుపత్రులు, అంగన్‌వాడీ కేంద్రాలలో ఆహార నాణ్యతలను నిర్ధారించడానికి టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కమిటి జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ వెల్ఫేర్ విద్యాసంస్థలు, అంగన్‌వాడీలు, ఆసుపత్రులు మరియు ప్రభుత్వం ఆహారం అందించే ఇతర ప్రదేశాలలో ఆహార భద్రత కోసం జిల్లా స్థాయి కమిటీలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్,
రెవెన్యూ డివిజనల్ అధికారి,
జిల్లా పౌర సరఫరాల అధికారి,
జిల్లా వ్యవసాయ అధికారి,
ఎస్సి, ఎస్టీ, బిసి, మైనారిటీసంక్షేమ శాఖల అధికారులు, ఫుడ్ ఇన్స్పెక్టర్ తో జిల్లా స్థాయి కమిటి ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
అలాగే కాటారం రెవెన్యూ డివిజన్ కు సంబంధించి రెవెన్యూ
అదనపు కలెక్టర్ అధ్యక్షతన పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్,
జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి,
జిల్లా సహకార అధికారి
జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి,
ఫుడ్ ఇన్స్పెక్టర్ తో కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
మండల స్థాయి కమిటీ కూడా క ఏర్పాటు చేయబడింది. ఈ కమిటీలో మండల ప్రత్యేక అధికారి చైర్మన్ గా ఉంటారని
ఎంపీడీఓ, తహసిల్దార్,
మండల విద్యాశాఖాధికారి ఉంటారని తెలిపారు.
ఈ జిల్లా, మండల కమిటీలు ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విద్యా సంస్థలు, ఆసుపత్రుల్లో ఆహారం అందిస్తున్న అన్ని ప్రభుత్వ సంస్థలలో తనిఖీ చేసి, తనిఖీ నివేదికను సమర్పించాలని ఆదేశించారు.
అంశాలు::-
బియ్యం, నిత్యావసర వస్తువులు నిల్వలు, వంటగది వద్ద పరిశుభ్రత ప్రమాణాలు, ఆహార నాణ్యతలు పరీక్షలు,
వంట చేయు సమయంలో ఆహార భద్రతా చర్యలు పాటింపు,
వంట చేసే ప్రదేశాన్ని పరిశుభ్రంగా ఉంచడం, వంట పాత్రలు, పరికరాలు, ఇతర వస్తువులను ఎప్పటికప్పుడు శుభ్రపరచడం,
కుక్, హెల్పర్స్ మరియు ఇతర సిబ్బంది వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం మరియు ఆరోగ్య పరీక్షలు, పెస్ట్ కంట్రోల్, ఫుడ్ సర్వింగ్ ఏరియా, పిల్లలు హ్యాండ్ వాష్ వ్యక్తి గత పరిశుభ్రత పాటించుట, సురక్షిత మంచినీటి సరఫరా, డ్రైనేజీలో వ్యర్థాలు నిల్వ లేకుండా పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహణ, వ్యర్దాలు తొలగింపు వంటి కార్యక్రమాలు కమిటీలు కేటాయించిన పరిధిలోని సంస్థలను తనిఖీ చేసి నివేదికలను సమర్పించాలని స్పష్టం చేశారు. ఆహార భద్రతా కమిటీలు చేసిన తనిఖీలు, తీసుకున్న చర్యలపై నివేదికలు అందచేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పేర్కొన్నారు.