- Advertisement -
ఉత్తరాఖండ్‌లో ఉమ్మడి పౌరస్మృతి
Common Citizens' Memory in Uttarakhand
డెహ్రాడూన్ జనవరి 27
బీజేపీ పాలిత రాష్ట్రం ఉత్తరాఖండ్‌లో ఉమ్మడి పౌరస్మృతి సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది. దాని లోని విధి విధానాలకు సంబంధించిన పోర్టల్‌ను ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ ధామి ఆవిష్కరించారు. ఉమ్మడి పౌరస్మృతి ద్వారా పౌరులందరికీ, సమానమైన హక్కులు, బాధ్యతలు దక్కేలా చూస్తామని ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ ధామి వెల్లడించారు. ఈరోజు ఉత్తరాఖండ్‌కే కాకుండా యావత్ దేశానికి చారిత్రాత్మకమైన రోజని, దేశంలో యాసీసీసి అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలిచిందన్నారు. ఉమ్మడి పౌరస్మృతి అమలుతో నిజమైన మహిళా సాధికారత కనిపిస్తుందని పేర్కొన్నారు.వారి హక్కులను కాలరాసే బాల్యవివాహాలు , ట్రిపుల్ తలాక్ , విడాకులు, ఆస్తుల వారసత్వం, బహుభార్యత్వం వంటి దురాచారాలను పూర్తిగా రూపుమాపడానికి యాసీసీ తోడ్పడుతుందని ధామి తెలిపారు. ఉమ్మడి పౌరస్మృతి ఏ మతానికి వర్గానికి వ్యతిరేకం కాదనే విషయాన్ని స్పష్టం చేయాలనుకుంటున్నట్టు వివరించారు. రాజ్యాంగం లోని ఆర్టికల్ 342 కింద పేర్కొన్న పలు షెడ్యూల్డ్ తెగలను దీని నుంచి దూరంగా ఉంచామని, తద్వారా ఆ తెగలు వారి హక్కులను పరిరక్షించుకోవచ్చని అన్నారు.
- Advertisement -



