కామన్ సర్వీస్ సెంటర్ వాహన సేవలను పకడ్బందీగా అందించాలి….
Common Service Center should provide vehicle services armed with….
అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి
ఖమ్మం
కామన్ సర్వీస్ సెంటర్ వాహన సేవలను పకడ్బందీగా అందించాలని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
మంగళవారం అదనపు కలెక్టర్, ఖమ్మం జిల్లాకు కేటాయించిన సి.ఎస్.సి. వాహనాన్ని ట్రైనీ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా కామన్ సర్వీస్ సెంటర్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, దీని ద్వారా ప్రజలకు వివిధ సంక్షేమ పథకాలు, వైద్య, విద్య, ఉపాధి, ఈ మొబిలిటీ, గ్రామీణ ఈ స్టోర్, న్యాయ సేవలు, పర్యాటక, వ్యవసాయ సహకారం, ఇతర రంగాలకు సంబంధించిన సేవలు వంటివి ప్రజలకు నేరుగా ఉచితంగా అందించేందుకు వీలు పడుతుందని అన్నారు.
దేశంలో ఇప్పటి వరకు స్థానిక పారిశ్రామిక వేత్తలచే 5.5 లక్షల కామన్ సర్వీస్ సెంటర్లు పనిచేస్తున్నాయని, వీటి ద్వారా స్థానికంగా ఉపాధి అందడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఈ- సేవలు అందుతున్నాయని అన్నారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు నేరుగా అందాలనే ప్రధానమంత్రి ఆశయాన్ని సి.ఎస్.సి. నిజం చేస్తుందని అన్నారు.
డిజిటల్ ఇండియా కామన్ సర్వీస్ సెంటర్ ప్రాజెక్టును దేశవ్యాప్తంగా 10 జిల్లాలలోనీ 4740 గ్రామ పంచాయతీల్లో మెరుగైన సేవలు, మౌళిక సదుపాయాలు ఈ గవర్నమెంట్ సర్వీస్ ఇండియా లిమిటెడ్ ద్వారా అమలు చేయడానికి ఎంపిక చేయడం జరిగిందని అన్నారు. ఖమ్మం జిల్లాను దీనికి ఎంపిక చేశారని, ఈ పథకం క్రింద కామన్ సర్వీస్ సెంటర్ ఈ గవర్నెన్స్ లిమిటెడ్ ద్వారా జిపిఎస్ ఉన్న వాహనం ద్వారా ప్రభుత్వ పథకాలపై విస్తృత ప్రచారం, అవగాహన కార్యక్రమాలు చేయడం, కార్యక్రమాల కోసం అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో డి.ఆర్.ఓ. రాజేశ్వరి, ప్రాజెక్టు జిల్లా కో ఆర్డినేటర్ షేక్ ఫయాజ్, ఈ.డి.ఎం. దుర్గా ప్రసాద్, జిల్లా మేనేజర్ పి. సురేష్ కుమార్, సంబంధిత అధికారులు, పాల్గొన్నారు.