ఎండిపోయిన పంటలకు నష్టపరిహారం చెల్లించాలి
మేదరమెట్ల డిమాండ్
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాష్ట్రవ్యాప్తంగా రబీసీజన్లో ఎండిపోయిన పంటలకు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు నష్టపరిహారం చెల్లించాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మెదరమెట్ల వెంకటేశ్వర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
స్థానిక కోదాడ పట్టణం సుందరయ్య భవన్లో శనివారం రైతు సంఘం పట్టణ కమిటీ సమావేశం జరిగింది
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రబిసీజన్లో రైతాంగం వేలాది ఎకరాలలో వరి పంట వేసి భూగర్భ జలాలు అడుగంటిపోయినందువలన సాగర్ ఎడమ కాలువ నీటి విడుదల లేక వేసిన పంటలు ఎండిపోయి రైతాంగం తీవ్ర నష్టానికి గురయ్యారని వారన్నారు.వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి రైతు అప్పుల పాలయ్యారని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ అధికారులు ఎండిపోయిన పంటలను పరిశీలించి ఎకరానికి 30 వేల రూపాయలు నష్టపరిహారాన్ని చెల్లించాలని వారన్నారు. వీరితోపాటు వందల ఎకరాలు కౌలు కు చేసిన రైతులు కూడా తీవ్ర నష్టపోయారని,,ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తానని నేటికీ అమలు చేయలేదని తక్షణం రైతులకు ఇచ్చిన ఆమీ అమలు చేయాలని వారన్నారు.
ఈ యొక్క సమావేశంలో రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు ఏనుగుల వీరాంజనేయులు, నెమ్మాని సంగమయ్య గొర్రె ముచ్చు మరి య న్న ,సిఐటియు పట్టణ కార్యదర్శి ఎం ముత్యాలు, కే వెంకటేష్ ,జి నాగరాజు, సైదులు తదితరులు పాల్గొన్నారు.