రెండు బెల్టు షాపుల మధ్య పోటీతత్వం..
Competition between two belt shops
-తీవ్ర ఘర్షణ దారితీసిన ఘటన..
-సూర్యాపేట మండలం, గాంధీనగర్ లో చోటు చేసుకున్న సంఘటన.
సూర్యాపేట
జిల్లా కేంద్రంలోని గాంధీనగర్ లోని పెద్దమ్మతల్లి దేవాలయం సమీపంలో “జక్కలి అంజమ్మ”, “బాలెంల నాగమ్మ” కుటుంబాలు పక్కపక్కనే కిరాణా దుకాణాలు నిర్వహిస్తూ.. అందులో గుట్టుచప్పుడు కాకుండా మద్యం విక్రయిస్తున్నారు. వ్యాపార విషయంలో.. వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఇదే విషయంలో.. మంగళవారం రాత్రి ఇరువర్గాల కుటుంబ సభ్యులు ఘర్షణ పడ్డారు. మరుసటి రోజున ‘బాలెంల నాగమ్మ’ తో పాటు మరో పదిమంది.. ‘జక్కలి అంజమ్మ’ దుకాణంపైకి వెళ్లి.. ఆమెతోపాటు భర్త రమేష్, కుమారుడు విగ్నేష్, సహా మరో ముగ్గురిపై దాడికి పాల్పడ్డారు. దాడి ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలు నిక్షిప్తమయ్యాయి. ఈ దృశ్యాలు సామాజిక మద్యమాల్లో వైరల్ గా మారాయి. ఇదిలా ఉండగా.. దాడికి పాల్పడిన వారిలో నోముల శివాని యువకులపై.. జక్కరి అంజమ్మ వర్గీయులు గురువారం ప్రతి దాడికి పాల్పడ్డారు. ఈ సమయంలోను ఫోనులో తీసిన దృశ్యాలు సామాజిక మద్యమాల్లో చెక్కర్లు కొట్టాయి. ఇరువర్గాలపై పోలిసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు.