- Advertisement -
వైకాపా నేతపై పిర్యాదు
Complaint against Vaikapa leader
కేసు నమోదు
వినుకొండ
వైసీపీ నాయకుడు అత్తర్ నాగూర్ వలి తనపై లైంగిక దాడి చేసి రెండు సార్లు గర్భం తీయించి ఇప్పుడు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడని తనకు న్యాయం చేయాలని వినుకొండ పట్టణనికి చెందిన యువతి షేక్ మస్తాన్ బి పోలీసులను ఆశ్రయించింది. పోలీ సుల సూచనల మేరకు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంత రం బాధితురాలు ల మీడియా ముందు తనకు జరిగిన అన్యా యాన్ని తెలియజేసింది.తనను నగ్నంగా వీడియో చిత్రీకరించి బెదిరించి తనపై పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడని, ఎవరికైనా విషయం చెప్తే వీడియో లు బయటకు పంపుతానని తనని, తన తల్లిని బెదిరించి, వైకాపా ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మ నాయుడు అండతో తనను లొంగదీసుకున్నా డని వాపోయింది. ఈ విషయమై తనకు న్యాయం కోసం గతంలో పోలీసులను ఆశ్రయించినా అప్పటి ఎమ్మెల్యేకి భయపడి కేసు నమోదు చేయలేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. తనను లింగికంగా వాడుకొని రెండు సార్లు గర్భం వస్తే బలవంతంగా ఓ ప్రైవేటు ఆసుపత్రి లో గర్భం తీయించాడని తెలిపింది. తనపై, తన తల్లి పై ఇటీవల నాగూర్ వలి తన అనుచరులతో వచ్చి దారుణంగా కొట్టి చేపస్తామని బెదిరించారని వెల్లడించింది. కాగా అత్తర్ నాగూర్ తనను కాదని, బాపట్ల జిల్లా, కొమ్మాలపాడుకి చెందిన మరో యువతిని పెళ్లిచేసుకునేందుకు నిశ్చితార్ధం చేసుకున్నాడని, తనలా మరో అమ్మాయి జీవితం నాశనం కాకూడదనే తాను పోలీసులను ఆశ్రయించినట్లు తెలిపింది.
- Advertisement -