ప్రజావాణి ద్వారా స్వీకరించిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి
జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్
నాగర్ కర్నూల్
ప్రజావాణి ద్వారా స్వీకరించిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ అన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆయన సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ భవన సముదాయంలోని సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు.
మొత్తం 26 ధరఖాస్తులు ప్రజావాణిలో నమోదు అయ్యాయి. ధరణీ సమస్యలపై 21 ధరఖాస్తులు వచ్చాయి. పంచాయతీ రాజ్ శాఖ కు 3 ధరఖాస్తులు, వైద్య, ఆరోగ్య శాఖకు ఒకటి, ఎస్ పీ డీ సీ ఎల్ శాఖ కు ఒకటి చొప్పున ధరఖాస్తులు వచ్చాయి.
ప్రజావాణి కార్యక్రమానికి గైర్హాజరు అయిన వైద్య, ఆరోగ్య శాఖ కు సోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశాలను జారీ చేశారు.
అనంతరం జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులతో మాట్లాడుతూ వివిధ సమస్యల పరిష్కారం నిమిత్తం ప్రజలు సమర్పించే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని, ఫిర్యాదులను పెండింగ్లో ఉంచవద్దని చెప్పారు. వివిధ మండలాల్లోని గ్రామస్థాయిలో ఉన్న అధికారులకు సైతం తెలియజేసి అక్కడికక్కడే ప్రజల ఫిర్యాదులను పరిష్కరించే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. దీనివల్ల ఫిర్యాదుదారులకు వారి సమస్య తక్షణమే పరిష్కారం కావడం వల్ల మేలు జరుగుతుందని ఆయన అన్నారు.
ఈ సోమవారం సైతం ఎప్పటిలాగే ధరణీకి సంబంధించిన సమస్యల ధరఖాస్తులు వచ్చాయి. నల్లమల్ల అటవీ ప్రాంతంల్లోని చెంచుల ఆవాసాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ఆయా చెంచుగూడేలాకు చెందిన చెంచులు జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్ కు వినతీ పత్రాలను అందజేశారు. జిల్లా కలెక్టర్ స్పందిస్తూ తాగునీటికి సంబంధించిన సమస్యను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటానని చెప్పారు. సీసీ రోడ్ల నిర్మాణం తదితర మోళిక వసతుల కల్పనకు కృషి చేస్తానని చెప్పారు.
ప్రజావాణి లో
ఉద్యోగం, ఉపాధి ,పెన్షన్ మంజూరు తదితర అంశాలపై ఎక్కువగా ఫిర్యాదులు వచ్చాయి.
రెవిన్యూ అధనపు కలెక్టర్ సీతారామా రావు,
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కుమార్ దిపక్ లు ప్రజావాణిలో భాగంగా ధరఖాస్తులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు.