గడువు లోపు స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు పూర్తి చేయండి.
Complete smart city projects within the deadline.
స్మార్ట్ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.మౌర్య.
తిరుపతి,
స్మార్ట్ సిటీ నిధులతో తిరుపతి నగరంలో జరుగుతున్న ప్రాజెక్టులు గడువులోపు పూర్తి చేయాలని స్మార్ట్ సిటీ మేనేజింగ్ డైరెక్టర్, నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య అధికారులను ఆదేశించారు. స్మార్ట్ సిటీ నిధులతో జరుగుతున్న వివిధ ప్రాజెక్టుల పనుల పురోగతిపై నిర్మాణ సంస్థల ప్రతినిధులు, స్మార్ట్ సిటీ అధికారులతో మంగళవారం మేనేజింగ్ డైరెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్, సిటీ ఆపరేషన్ సెంటర్, గరుడ వారధి, మల్టీ లెవెల్ కార్ పార్కింగ్, గ్లో గార్డెన్, క్రికెట్ స్టేడియం తదితర ప్రాజెక్టుల్లో జరుగుతున్న పనుల వివరాలను వివరించారు.
ఈ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.మౌర్య మాట్లాడుతూ స్మార్ట్ సిటీ నిధులతో జరుగుతున్న ప్రాజెక్టులు గడువు సమీపిస్తున్న పనులు ఆలస్యంగా ఎందుకు జరుగుతున్నాయని ప్రశ్నించారు. అన్ని ప్రాజెక్టులు ఇచ్చిన గడువులోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పాత మునిసిపల్ కార్యాలయం స్థానంలో నిర్మిస్తున్న సిటీ ఆపరేషన్ సెంటర్ (నగరపాలక సంస్థ కార్యాలయం) పనులను సకాలంలో త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గరుడ వారధిలో పెండింగ్ లో ఉన్న పనులు కూడా త్వరగా పూర్తి చేయాలని ఆ సంస్థ ప్రతినిధులు ఆదేశించారు. ముఖ్యంగా కోర్లగుంట వద్ద పెండింగ్ లో ఉన్న డ్రైనేజీ కాలువల నిర్మాణం పూర్తి చేయాలని, న్యాయపరమైన సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. మల్టి లెవల్ కార్ పార్కింగ్, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణాల్లో ప్రభుత్వపరమైన అన్ని అనుమతులు తీసుకోవాలని అన్నారు. వినాయక సాగర్ లో గ్లో గార్డెన్ పనులు పూర్తి చేయాలని అన్నారు. క్రికెట్ స్టేడియం లో పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేసి, ప్రారంభోత్సవానికి సిద్దం చేయాలని అన్నారు. ఈ సమావేశంలో స్మార్ట్ సిటీ జనరల్ మేనేజర్ చంద్రమౌళి, సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, ఈ.ఈ.లు చంద్రశేఖర్, డి.ఈ.లు రాజు, మధు, వెంకట ప్రసాద్, డి.సి.పి. మహాపాత్ర, స్మార్ట్ సిటీ ఏ.ఓ.రాజశేఖర్, సి.ఎఫ్.ఓ. మల్లికార్జున, ఏఈకాం ప్రతినిధులు బాలాజి, అనిల్, వివిధ నిర్మాణ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.