- Advertisement -
తిరుమల లడ్డూ నాణ్యత లోపం పై ఆందోళన
Concern over the quality of Tirumala Laddu
నందిగామ
తిరుమల వెంకటేశ్వర స్వామి దేవాలయం లడ్డూ నాణ్యత లోపం పై నందిగామ లో తెలుగుదేశం నాయకులు ఆందోళన నిర్వహించారు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి, కలిపి అపవిత్రం చేసి మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి హిందువుల మనో భావాలను దెబ్బతీశారని తెలుగు దేశం కార్యాలయం వద్ద మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. జగన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భక్తులు ఎంతో పవిత్రంగా భావించే తిరుమల లడ్డూ తయారీలో జంతు కొవ్వుతో కూడిన నెయ్యివాడడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా నాయకులు కమీషన్లకు కక్కుర్తి పడి లడ్డూ నాణ్యత లేకుండా తయారు చేయించినట్లు ఆరోపించారు. పూర్తిస్థాయిలో విచారణ చేసి బాధ్యుల పై చర్యలు తీసుకోవాలని కోరారు.
- Advertisement -