అజ్ఞాత దళ కమాండర్ “పూనెం రమేష్” అరెస్టును ఖండించండి.
Condemn the arrest of Agyatia Commander Poonem Ramesh
కామ్రేడ్ పునెం రమేష్ ను వెంటనే కోర్టుకు హాజరు పరచాలి.
ఐ కృష్ణ, ఐ ఎఫ్ టి యు రాష్ట్ర అధ్యక్షులు
రామగుండం
కామ్రేడ్ పూనేం రమేష్ అన్న అరెస్టును ఖండిస్తూ. వెంటనే కోర్టులో హాజరు పరచాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం నాడు గోదావరిఖని పైలాన్ చౌరస్తాలో సిపిఐ(ఎం-ఎల్) న్యూడెమోక్రసీ పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన తెలపడం జరిగింది.
ఈ సందర్భంగా ఐ ఎఫ్ టి యు రాష్ట్ర అధ్యక్షులు ఐ క్రిష్ణ మాట్లాడుతూ.. కామ్రేడ్ పూనెం రమేష్ అన్న ను ఇల్లందు మండలం మర్రిగూడెం పంచాయితీ ఎల్లాపురంలో ఆరోగ్యం బాగా లేక ఇంట్లో విశ్రాంతి తీసుకుంటన్న సమయంలో గురువారం నాడు పోలీసులు పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని,
కామ్రేడ్ పూనెం రమేష్ అన్న కు ఎటువంటి హాని తలపెట్టకుండా ఏమైనా కేసులు ఉంటే వెంటనే కోర్టులో హాజరు పరచాలని రాష్ట్ర ప్రభుత్వం ని డిమాండ్ చేసారు.ప్రజల కోసం ప్రజా హక్కుల కోసం నిరంతరం పోరాడుతూ పోడు భూముల రక్షణ కొరకు పోరాడుతున్న న్యూడెమోక్రసీ నాయకులపై పోలీస్ నిర్బంధాన్ని కొనసాగించడాన్ని ఖండిస్తున్నామ్మన్నారు, కామ్రేడ్ రమేష్ అన్నకు ఎలాంటి ప్రాణహాన్ని జరగకుండా బేసరత్తుగా కోర్టులో హాజరుపరచాలని సిపిఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుందన్నారు.
ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు ఏ వెంకన్న, ఇ నరేష్, బి అశోక్, కొల్లూరి మల్లేశ్, ఏ ఐ కే ఎం ఎస్. జిల్లా అధ్యక్షులు మేరగు చంద్రయ్య, ఎం దుర్గయ్య, పైడిపల్లి రమేష్, సమ్మెట తిరుపతి, ఎం కొమరయ్య, ఐ సాంబయ్య, సదయ్య, ఏ చంద్రయ్య, జనార్ధన్, మాడ స్వామి, ఆటో సాయి, శ్రీనివాస్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.