- Advertisement -
వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా సాంప్రదాయబద్ధంగా నడుపుకోండి
– డోన్ డిఎస్పీ
Conduct Vinayaka festivals in a calm and traditional manner- Done DSP
బేతంచర్ల
: వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంతంగా హిందూ ముస్లిం సోదరులు కుల మతాలకతీతంగా గత సాంప్రదాయాలకు అనుగుణంగా ఉత్సవాలు జరుపుకోవాలని డోన్ డిఎస్పి శ్రీనివాసులు కోరారు.శుక్రవారం స్థానిక పోలీస్ స్టేషన్ లో సిఐ.డి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా హిందు ముస్లింలు సోదరులతో పీస్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు.ఈ సమావేశంలో పోలీస్ శాఖతో పాటు రెవెన్యూశాఖ తహశీల్దార్ ప్రకాష్ బాబు, ఎంపిడిఓ వెంగన్న, ప్రభుత్వ వైద్యులు డా. సాగారిక, విద్యుత్ ఏడి మధు సుధన్ రెడ్డి,ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.అనంతరం డిఎస్పీ శ్రీనివాసులు మాట్లాడుతూ వినాయకుని మండపాల వద్ద భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఏర్పాట్లు చేసుకోవాలని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆయా కమిటీ నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.ఆయా శాఖల అధికారులు మాట్లాడుతూ వినాయకుని మండపాల వద్ద విద్యుత్ షాట్ సర్క్యూట్ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని,వర్షాలు కురుస్తున్నాయి కావున మండపాల వద్ద విద్యుత్ వైర్లు ఎక్కడ వేలాడకుండా,వైర్లు జాయింట్ లు లేకుండా జాగ్రత్తలు తీసుకోవలని సూచించారు. మండపాల వద్ద రోగాలు ప్రబలకుండా వైద్య సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, రెవెన్యూశాఖ శాఖ సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.పట్టణంలోని జెండా మసీదు వద్ద ముస్లింల మనోభావాలు దెబ్బతినకుండా వారి నమాజ్ సమయాలలో ప్రశాంతంగా ఉండాలని,మసీదులు వద్ద గట్టి బందోబస్తును ఏర్పాటు చేయాలని డిఎస్పీ పోలీస్ అధికారులకు సూచించారు.పట్టణంలో సుమారు 60 విగ్రహాలు పైగా వుంటాయని కావున ఆయా కమిటీ నిర్వాహకులు అనుకున్న సమయానికి కంటే ముందుగానే విగ్రహాలను నిమజ్జనానికి తరలించాలని,వినాయకుని ఘాట్ వద్ద లైటింగ్ సౌకర్యం ఏర్పాటుచేసుకోవలని అన్నారు.ముస్లిం సోదరులు మాట్లాడుతూ వినాయక చవితి ఉత్సవాలకు అధికారుల సలహాలు సూచనలు తప్పక పాటిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు గౌరీ హుస్సేన్ రెడ్డి,విజయ నాగరాజు,గుండా గోపాల్,హరికృష్ణ,నూర్ అహ్మద్,మూర్తుజా వలి,తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



