- Advertisement -
జెడ్పి బాలికల పాఠశాలలో కెరీర్ గైడెన్స్ ప్రోగ్రాం నిర్వహణ
Conducting Career Guidance Program in ZP Girls School
మంథని
మంథని పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో గురువారం ఇండియా లిటరసీ ప్రాజెక్టు ఆధ్వర్యంలో విద్యార్ధులకు కెరీర్ గైడెన్స్ పై కెరీర్ గైడ్ కోట కిషోర్ బాబు విద్యార్థులకు పదవ తరగతి తరువాత వివిధ కోర్సులు,విద్య అవకాశాలు,పలు అంశాలు పై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాద్యాయులు యస్ సుమలత మాట్లాడుతూ పదవ తరగతి తరువాత ఏమిటి అనే సందేహంతో ఉన్న ప్రతి విద్యార్థి కి ఒక దిశ నిర్దేశం చేసేలా విద్యార్ధులకు కోర్సులు గురించి తెలియ చేయడమే కాకుండా విద్యార్థులకు ఎప్పుడు అందుబాటు లో ఉండేందుకు డిజిటల్ రిసోర్స్ అయిన చాట్ బొట్ నంబర్, హెల్ప్ లైన్ నంబర్ , వెబ్సైట్ ఉపయోగించి కెరీర్ పై మరింత అవగాహన పెంచుకోవడానికి ఈ ప్రోగ్రాం ఎంతో ఉపయోగకరంగా ఉందని అన్నారు.ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఇండియా లిటరసీ ప్రాజెక్టు వారిని ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాద్యాయులు గీట్ల భరత్ రెడ్డి, పరంజ్యోతి, పోచయ్య, దొంతుల కుమార్ లతో పాటు అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.
- Advertisement -